అదృష్టం బాగుంది లేకుంటే! : చిన్నారిని కిడ్నాప్ చేయటానికి ఎలా ట్రై చేశాడో చూడండీ

  • Published By: veegamteam ,Published On : September 18, 2019 / 06:20 AM IST
అదృష్టం బాగుంది లేకుంటే! : చిన్నారిని కిడ్నాప్ చేయటానికి ఎలా ట్రై చేశాడో చూడండీ

అది పంజాబ్ లోని లుథియానాలోని రిషి నగర్. ఆరుబైట గాలి కోసం స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని ఇద్దరు చిన్నారులతో కలిసి భార్యాభర్తలు నిద్రిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు ఓ రిక్షావాడు వచ్చాడు. వాడికి 45 ఉంటాయేమో. వాడి కన్ను ఆ చిన్నారులపై పడింది. ఎత్తుకెళ్లిపోదాం అనుకున్నాడు. అటు ఇటూ చూశాడు. ఎవ్వరూ లేరు.  అంతా నిర్మానుష్యంగా ఉంది. అంతే నెమ్మదిగా వారు పడుకున్న మంచాల పక్కకు వచ్చాడు. రిక్షాలో ఉన్న కవర్లను సర్ధిపెట్టాడు. నెమ్మదిగా మంచం పక్కకు వెళ్లి తండ్రి పక్కనే నిద్రస్తున్న చిన్నారిని ఎత్తుకున్నాడు. 

సరిగ్గా అప్పుడే పక్క మంచంపై నిద్రిస్తున్న భార్యకు మెలకువ వచ్చింది. బిడ్డను ఎవరో ఎత్తుకోవటం చూసింది. అంతే ఒక్కసారిగా వాడిపై దాడి చేసింది. కేకలు వేసి భర్తను లేపింది. దీంతో రిక్షావాడు పరారయ్యాడు. వాడిని పట్టుకునేందుకు భర్త కొద్ది దూరం వెళ్లేసరికే వాడు పరారయ్యాడు.

దీంతో బైట పడుకోవటం క్షేమం కాదని భావించిన ఆమె తలుపు తాళం తీసి చిన్నారులతో సహా అందరూ లోపలికెళ్లిపోయారు.  చూశారా? ఎంతలో ఎంత ప్రమాదం తప్పిందో. అలా చిన్నారుల్ని ఎత్తుకుపోయుంటే?..ఏం చేసేవాడో కదా..వినటానికే గుండెలు హడలిపోతున్నాయి. కంటిలో కనుపాపను కూడా దొంగిలించే ఈ రోజుల్లో బిడ్డల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 

చిన్నారులపై వేధింపులు..కిడ్నాప్ లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు.. బంధువులు అన్ని సమయాల్లోను అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఆదమరిచిన కన్నుమూసి తెరిచేలోగా..బిడ్డల్ని మాయం చేసే ఇటువంటి దుర్మార్గుల బారిన పడతారు. అదృష్టం బాగుంటే బిడ్డలు క్షేమంగా దొరుకుతున్నారు. కానీ అన్ని వేళలా అలా జరగదు. కాబట్టి చిన్నారులు విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదిగో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదు.