Man Cuts Cabbage :వావ్..వాటే టైమింగ్..! క్యాబేజీని ఏం కట్ చేస్తున్నావ్ భయ్యా..

ఈ వీడియో చూస్తే..వావ్.. వాటే టైమింగ్..! క్యాబేజీని ఏం కట్ చేస్తున్నావ్ భయ్యా..అవి చేతులా మిషన్లా అని అనిపించకమానదు..

Man Cuts Cabbage :వావ్..వాటే టైమింగ్..! క్యాబేజీని ఏం కట్ చేస్తున్నావ్ భయ్యా..

Man Cuts Cabbage At Lightning Speed

Man cuts cabbage at lightning speed : ఒక్క ఉల్లిపాయ కట్ చేయటానికి నానా తిప్పలు పడతాం.ఒక్క క్యాబేజీకి లేయర్లు కట్ చేయాలంటే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏవేలే కట్ చేసుకుంటాం. అటువంటిదో ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు వాయు వేగంతో క్యాబేజీ శుభ్రం చేయటానికి దానికున్న ఎక్స్ ట్రా లేయర్లను కట్ చేసే విధానం చూస్తే రెప్ప వేయటం కూడా మర్చిపోయి అలాగే చూస్తుండిపోవాల్సిందే.

అది హోల్ సేల్ వెజిటబుల్ మార్కెట్. అమ్మకానికి మార్కెట్ కు వచ్చిన క్యాబీజీలను శుభ్రం చేసే పని పెట్టుకున్నారు అక్కడ పనిచేసేవారు. క్యాబేజీలు రాసులుగా పోసి ఉన్నాయి. వాటిని ఫిల్టర్ చేస్తూ మూటలుగా కట్టి పేరుస్తున్నారు. దీంట్లో భాగంగా ఓ వ్యక్తి ఫాస్టుగా క్యాబేజీలను కట్ చేయటానికి (అదనపు పొరలు కట్ చేయటానికి) అందిస్తుంటే కట్ చేసే వ్యక్తి కూడా అంతకంటే వేగంగా వాటిని కట్ చేసి బస్తాలో వేస్తున్నాడు. వారి వేగం చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే.

క్యాబేజీలపైన ఎన్నో లేయర్ల చొప్పున పొరలు ఉంటాయి. వాటిల్లో పనికిరాని పై లేయర్లను తొలగించి క్యాబేజీలను ప్యాక్ చేస్తున్నారు అక్కడున్నవారు. వాయు వేగంతో చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోతాం. చక్కటి టైమిగ్ తో క్యాబేజీని అందిపుచ్చుకోవటం వాటిపైన ఉన్న ఎక్స్ ట్రా పొరలను కట్ చేసి బస్తాలో వేయటం చూస్తే వావ్ అనిపిస్తుంది.ఒక వ్యక్తి కింద కూర్చుని ఒక్కో క్యాబేజీని పైకి విసురుతుంటే.. మరో వ్యక్తి చాకుతో అంతే వేగంగా క్యాబేజీని పట్టుకుని అదనపు లేయర్లను కత్తితో తెగ్గోసి పక్కకు విసురుతుంటే..వావ్ భలే చేస్తున్నార్రా బాబూ అని అనిపించకమానదు. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ వారి టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది..

ఈ వీడియోను గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకి చక్కటి స్పందన వస్తోంది. ‘‘భారత్ కు రోబోటిక్ ఆటోమేషన్ అవసరం లేదనేది ఇందుకే’’అంటూ ఎరిక్ సోల్హీమ్ కామెంట్ పెట్టడం భలే ఉంది.