Bengaluru: ఫ్లై ఓవర్ మీద నిలబడి నోట్లు ఎగజల్లిన ఓ వ్యక్తి.. అందుకోవడానికి ఎగబడ్డ జనం

నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్‭కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైపుకు వస్తుండడంతో జనాలు అటువైపు కూడా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Bengaluru: ఫ్లై ఓవర్ మీద నిలబడి నోట్లు ఎగజల్లిన ఓ వ్యక్తి.. అందుకోవడానికి ఎగబడ్డ జనం

Man rains notes from Bengaluru flyover, people sweep in to collect

Bengaluru: డబ్బులు ఆకాశం నుంచి రాలిపడవు అని తరుచూ అంటుంటారు. వాస్తవానికి ఆకాశం నుంచి కూడా డబ్బులు పడతాయి. అయితే అవి ఊరికే రాలిపడవు. ఎవరో ఒకరు పడేస్తే పడతాయి. తాజాగా బెంగళూరులో పడ్డాయి. అంతే.. ఆ నోట్లను అందుకోవడానికి వాహనాలను నిలిపివేసి జనాలు పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అయినప్పటికీ పట్టించుకోకుండా పై నుంచి పడుతున్న నోట్లను వీలైనంత ఎక్కువ జమ చేసుకోవడంలో ప్రయాణికులు నిమగ్నమైపోయారు.

Students Missing Nellore : నెల్లూరు జిల్లాలో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినులు మిస్సింగ్

నగరంలోని కేఆర్ మారెట్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన సంఘటన ఇది. ఒక వ్యక్తి ఫ్లైఓవర్ మీద నలబడి అదే పనిగా నోట్లను విసిరాడు. తనతో పాటు తెచ్చుకున్న సంచిలో నిండుగా ఉన్న పది రూపాయల నోట్లను ఫ్లైఓవర్‭కు రెండు వైపులా విసిరాడు. కొన్ని నోట్లు గాలికి ఫ్లైఓవర్ వైపుకు వస్తుండడంతో జనాలు అటువైపు కూడా పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ప్రకారం.. నలుపు రంగు సూట్ వేసుకున్న ఒక వ్యక్తి తన సంచిలో నుంచి పది రూపాయల నోట్లను అదే పనిగా విసరడం చూడొచ్చు.

Bharat Jodo Yatra: రాహుల్‌తో బాలీవుడ్ నటి .. జమ్మూలో భారీ భద్రత నడుమ భారత్ జోడో యాత్ర ..

స్కూటర్ మీద వచ్చిన ఆ వ్యక్తి, నోట్లు విసరడం పూర్తి కాగానే అదే స్కూటర్ మీద వెళ్లిపోయాడట. అయితే అలా ఎందుకు నోట్లను గాలిలో విసిరేసాడనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే కొంతమంది స్థానికులు తెలిపిన దాని ప్రకారం.. జీవితం మీద చాలా విరస్తి లేసి, తన వద్ద ఉన్న డబ్బును విసిరేయాలని అనుకున్నట్లు పేర్కొన్నారు.