MRI Scanning : ఎమ్మారై స్కానింగ్‌కు వెళితే మెషీన్‌లో చేయి ఇరుక్కుపోయింది

పేషెంట్ ని తీసుకోని ఎమ్ఆర్ఐ స్కానింగ్ సెంటర్ కి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మిషిన్ లో ఇరుక్కుపోయాడు. దీంతో అతడి చిటికెన వెలికి గాయమైంది. కాగా ఈ ఘటన ముంబైలో జరిగింది.

MRI Scanning : ఎమ్మారై స్కానింగ్‌కు వెళితే మెషీన్‌లో చేయి ఇరుక్కుపోయింది

Mri Scaning

MRI Scanning : ప్రమాదవశాత్తు ఓ అంబులెన్స్ డ్రైవర్ ఎమ్ఆర్ఐ మెషీన్‌ లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన విక్రమ్ అబ్ నవే.. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ పేషెంట్ ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ నిమిత్తం ‘ప్రతామ్‌ ఎమ్‌ఆర్‌ఐ అండ్‌ సీటీ స్కాన్‌ సెంటర్‌’కు తీసుకుని వెళ్ళాడు.

Mri Scanning

Mri Scanning

పేటెంట్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆక్సిజన్ ఉంచి ఎమ్ఆర్ఐ స్కానింగ్ మెషీన్‌ ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లారు. పేషెంట్ తోపాటు ఆక్సిజన్ సిలెండర్ ను లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్.. ఇదే సమయంలో అతడికి షాక్ కొట్టినట్లుగా అనిపించింది.. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఎమ్ఆర్ఐ మెషీన్‌ విక్రమ్‌ చేయిని తనలోకి లాక్కుంది. దీంతో అతడు ఎమ్‌ఆర్‌ఐ మెషీన్‌ లో ఇరుక్కున్నాడు.

ఓ చేతిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉందిగా. మరో చేయి ఎమ్‌ఆర్‌ఐలోకి వెళ్లిపోయింది. అతడు తన చేతిని గట్టిగా వెనక్కులాక్కున్నాడు. ఆ వెంటనే ఎమ్‌ఆర్‌ఐ రూములోనుంచి బయటకు వచ్చాడు.. ఈ ప్రమాదంలో విక్రమ్ చేతికి తీవ్ర గాయం కావడంతో రక్తం దారల కారిపోయింది. బయటకి వచ్చి కేకలు వేయడంతో ఎమ్ఆర్ఐ సెంటర్ సిబ్బంది వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిటికెనవేలు విరిగిపోవడంతో రాడ్ వేశారు.