Crooked mind Man : భార్యకు వరుడు కావాలని మ్యాట్రిమెునిలో వివరాలు పెట్టిన భర్త

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడు.

Crooked mind Man : భార్యకు వరుడు కావాలని మ్యాట్రిమెునిలో వివరాలు పెట్టిన భర్త

Man (1)

wife details in matrimony : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యపై కోపంతో ఆమెకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో పెట్టి వక్రబుద్ధి చాటుకున్నాడు. భార్యకు వరుడు కావాలని మ్యాట్రిమెునిలో వివరాలు పెట్టాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)కి వెళ్లియూర్‌ పంచాయతీ అధ్యక్షుడు సురేష్‌బాబు కుమారుడు ఓంకుమార్‌(34)తో 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

Helmet – Mask: మాస్క్, సెకండ్ హెల్మెట్ లేకున్నా ఫైన్ తప్పదు.. బీ అలర్ట్!!

విడాకులు కావాలని ఓంకుమార్‌ పూందమల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారణ సాగుతోంది. అయితే భార్యపై కోపంతో రెండు వారాల క్రితం ప్రముఖ మ్యాట్రిమొనిలో వరుడు కావాలని ఆమె వివరాలను ఉంచాడు. ఆసక్తి కలిగిన వారు యువతి తండ్రిని సంప్రదించాలని పేర్కొన్నాడు.

యువతి తండ్రికి ఫోన్‌కాల్స్‌ రావడంతో ఆయన తిరువళ్లూరు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓంకుమార్‌ ఆమె వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఓంకుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.