కొలుదీరిన కుటీరం : ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇల్లు భలే ఉందిగా..

  • Published By: nagamani ,Published On : November 16, 2020 / 03:09 PM IST
కొలుదీరిన కుటీరం : ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇల్లు భలే ఉందిగా..

Mangaluru organisation plastic recycled house : ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయంగా మారిపోతోంది. ప్లాస్టిక్ మహమ్మారికి భూతాపం పెరిగిపోతొంది. కానీ ప్లాస్టిక్ మహమ్మారి పట్టిన జనాల ఆలోచనకు ప్రత్యామ్నాయం జరగాల్సిందే. చెడును మంచిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



మనం వాడే ప్లాస్టిక్ మన ప్రాణాలకే ముప్పుగా మారుతుందనే విషయం తెలిసి కూడా చేస్తున్నాం. ఇది తెలిసి చేసే తప్పు. కానీ కొంతమంది ఆ ప్లాస్టిక్ ను రీ సైక్లింగ్ చేసి ఎన్నో కళాఖండాల్ని తయారు చేస్తున్నారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా ఇల్లు కట్టటం ఎక్కడన్నా చూశారా? చూడలేదు కదూ..ఇదిగో ఇక్కడ చూడండీ..ప్లాస్టిక్ వ్యర్ధాలతో కట్టిన ఈ ఇల్లు చూస్తే నిజమేనా ఇది ప్లాస్టిక్ వ్యర్ధాలతో కట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..నిజమే కదూ చాలా చాలా బాగుందీ ప్లాస్టిక్ ఇల్లు..



వివరాల్లోకి వెళితే..మంగళూరుకు చెందిన ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ ఇండియా ఫౌండేషన్ కు వచ్చిన వినూత్న ఆలోచనే ఈ ప్లాస్టిక్ ఇల్లు. మంచిగా ఉండే ఈ భూమిని ప్లాస్టిక్ వాడకాలతో కలుషితం చేస్తూ..హాని కలిగించేదీ మనిషే..ఆ చెడునుంచి మంచిని రూపొందించేదీ ఆ మనిషే. ఇదిగో అటువంటి ఆలోచనకు వినూత్న రూపమే ఈ ‘ప్లాస్టిక్ ఇల్లు’. ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ ఇండియా ఫౌండేషన్ సరికొత్త ఆలోచనతో ఈ ప్లాస్టిక్ ఇంటికి రూపునిచ్చింది. సుమారు 1,500 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను రిసైకిలింగ్ చేసి ఇల్లు నిర్మించారు.



ఈ సందర్భంగా ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ ఇంపాక్ట్ ఆఫీసర్ షిఫ్రా జాకబ్స్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్లాస్టిక్ ఇంటి నిర్మాణం కోసం రూ.4.5 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు. ఇది ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అనీ..2021 కల్లా.. చెత్తను సేకరించే శ్రామికుల కోసం 20 ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో అందరం చాలా ఇష్టపడి కష్టపడి పనిచేస్తున్నాం’’ అని తెలిపారు.