సాయం కోరిన విద్యార్థినితో ప్రొఫెసర్ పాడు పని, బాగోతం బయటపెట్టిన వాట్సాప్

సాయం కోరిన విద్యార్థినితో ప్రొఫెసర్ పాడు పని, బాగోతం బయటపెట్టిన వాట్సాప్

WhatsApp

professor flirts with student on WhatsApp: గురువంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో పయనించేలా చూసేది గురువే. అందుకే, గురువుని దైవంగా భావిస్తారు. ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తారు. అయితే, కొందరు గురువులు కీచకుల్లా మారుతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు దిగుతున్నారు.

ఎంఫిల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ప్రొఫెసర్‌ సాయం కోరిన విద్యార్థినికి ఊహించని అనుభవం ఎదురైంది. ప్రొఫెసర్ తీరు విద్యార్థినితో పాటు అధికారులను విస్మయానికి గురి చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌ జిల్లాలో ఓ ప్రొఫెసర్‌, విద్యార్థిని మధ్య జరిగినట్టు చెబుతున్న వాట్సాప్‌ చాట్‌ వైరల్‌గా మారింది. చౌదరి చరణ్‌ సింగ్‌ యూనివర్సిటీ (సీసీఎస్‌యూ) క్యాంపస్‌ ప్రొఫెసర్‌, ఎంఫిల్‌ అభ్యర్థిని మధ్య జరిగిన చాటింగ్‌తో ప్రొఫెసర్‌ తీరుపై జనాలు మండిపడుతున్నారు. ఇంకా పెళ్లి కాని ఆ ప్రొఫెసర్‌.. విద్యార్థినితో…‘నీ ముక్కు చాలా బాగుంటుంది..నీలాంటి అందమైన అమ్మాయితో స్నేహాన్ని ఎవరు కోరుకోరు.? నువ్వు కొంచెం బరువు తగ్గితే ఇంకా బాగుంటావు..ఫ్యాట్‌గా ఉన్నా బాగానే ఉన్నావు..నీ డిస్‌ప్లే పిక్చర్‌ (డీపీ) ఎందుకు మార్చుకోవు..? అంటూ సాగించిన చాట్‌ బయటపడటంతో విద్యార్ధులు, జిల్లా అధికారులు విస్తుపోయారు.

ఎంఫిల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ప్రొఫెసర్‌ సాయం కోరిన విద్యార్థినితో ఆయన వాట్సాప్‌ చాట్‌ బాగోతం ఇలా బయటపడింది. ప్రొఫెసర్‌ డీపీ ఆధారంగా ఆయన సీసీఎస్‌ వర్సిటీ క్యాంపస్‌ ప్రొఫెసర్‌గా వెల్లడైంది. పరీక్షకు సిద్ధమయ్యేందుకు తనకు బుక్స్‌ను రిఫర్‌ చేయాలని యువతి కోరగా ఆమెకు అడ్మిషన్‌ దొరికేలా తాను చొరవ చూపుతానని ప్రొఫెసర్‌ ప్రలోభపెట్టినట్టు తెలిసింది.

అడ్మిషన్లలో సాయం చేస్తామనే పేరుతో టీచర్లు విద్యార్థినులను ప్రలోభాలకు గురిచేయడం కలకలం రేపింది. ఇక విద్యార్థినితో ప్రొఫెసర్‌ చాట్‌ వైరల్‌ కావడంతో ఈ విషయాన్ని వర్సిటీ దృష్టికి తీసుకువెళ్లామని మీరట్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు. వారం రోజుల్లోగా దీనిపై బదులివ్వాలని సీసీఎస్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. సదురు ప్రొఫెసర్ పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.