సివిల్స్‌లో”రాహుల్ మోదీ”కి 420 ర్యాంకు..ట్విట్టర్ లో ఫుల్ ట్రెండింగ్

  • Published By: madhu ,Published On : August 5, 2020 / 07:58 AM IST
సివిల్స్‌లో”రాహుల్ మోదీ”కి 420 ర్యాంకు..ట్విట్టర్ లో ఫుల్ ట్రెండింగ్

సివిల్స్ పరీక్షా ఫలితాల్లో రాహుల్ మోదీకి 420 ర్యాంకు వచ్చింది. భారత ప్రధాన మంత్రి మోడీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీయైన కాంగ్రెస్ నేత రాహుల్..ఈ ఇద్దరు పేర్లు కలిపి ఉన్న ఆ వ్యక్తి అందరినీ ఆకర్షిస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా..మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు..కొన్ని ఫొటోలను ట్వీట్ చేస్తున్నారు.



పార్లమెంట్ సమావేశాల్లో మోడీని..రాహుల్ కౌగిలించుకోవడం ఉన్న ఫొటోను ఒకరు పోస్టు చేస్తే..యూపీఎస్సీలో ర్యాంకు 1 నెంబర్ అంత ట్రెండ్ కాలేదు..కానీ 420వ ర్యాంకు సాధించిన ఈ వ్యక్తి మాత్రం ట్రెండ్ అయ్యాడని మరొకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సపోర్టా ? లేక బీజేపీ సపోర్టా ? అంటూ ఇంకొకరు ప్రశ్నించారు. సివిల్స్ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక..రాహుల్ మోదీ విషయానికి వస్తే…సివిల్స్ పరీక్ష 2019 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 829 మంది ఎంపికైనట్లు తెలిపింది. వీరి పేర్లు, ర్యాంకులను వెల్లడించింది. ప్రదీప్ సింగ్ మొదటి స్థానంలో నిలిచారు. అందులో రాహుల్ మోదీ అనే వ్యక్తి 420 ర్యాంకు సాధించాడు. భారత రాజకీయ రంగంలో ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుు (మోడీ – రాహుల్ గాంధీ) గుర్తుకు తెచ్చేలా ఆయన పేరు ఉండడం అందర్నీ ఆకర్షించింది.



మొత్తం 927 ఖాళీలకు గాను..829 మంది అభ్యర్థులు కేంద్ర సర్వీసులకు ఎన్నికయ్యారు. 182 మంది అభ్యర్థుల ఫలితాలను యూపీఎస్పీ రిజర్వ్ లో ఉంచింది. ఎంపికైన వారు సాధించిన మార్కుల జాబితాను మరో 15 రోజుల్లో వెల్లడిస్తామని తెలిపింది.