NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంసలు

2020 జూలై నుంచి అమలవుతున్న ఈ గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆవు పేడను సేకరిస్తారు. గో మూత్రాన్ని సేకరించడం సైతం ఈ మధ్యే ప్రారంభమైంది. గోమూత్రానికి లీటర్ 4 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పేడ, మూత్రంతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నగదు పంపుతోంది

NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంసలు

Modi prises congress CM in NITI Aayog meeting

NITI Aayog meeting: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి అయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రపతి భవన్‭లోని కల్చరల్ సెంటర్‭లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‭లు, కొంత మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నానరు. కాగా, ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‭పై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. ఛత్తీస్‭గఢ్‭లో గోధన్ న్యాయ్ యోజన (Godhan Nyay Yojana) పేరిట చేపట్టిన కార్యక్రమాన్ని మోదీ ప్రస్తావిస్తూ ఉత్తమ కార్యక్రమంగా కొనియాడారు. అలాగే ఆవు పేడ ద్వారా కంపోస్ట్ తయారు చేయడాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రావాలని ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‭ను ఆదర్శంగా తీసుకోవాలని మోదీ అన్నారు.

2020 జూలై నుంచి అమలవుతున్న ఈ గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆవు పేడను సేకరిస్తారు. గో మూత్రాన్ని సేకరించడం సైతం ఈ మధ్యే ప్రారంభమైంది. గోమూత్రానికి లీటర్ 4 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పేడ, మూత్రంతో కంపోస్ట్ తయారు చేస్తున్నారు. గోధన్ న్యాయ్ యోజన పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నేరుగా నగదు పంపుతోంది. ఈ పథకం ద్వారా గోవుల సంరక్షణతో పాటు పంటపొలాలు సారవంతం కావడం రైతన్నలకు మేలు చేస్తోందని ప్రశంసలు అందుతున్నాయి.

Gujarat Elections: హామీల జల్లు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్