చౌకీదార్ చమత్కారం : 70ఏళ్లుగా బ్యాంకు ఖాతాలే ఇవ్వలేదు.. డబ్బులు వేస్తారా

యూపీ: 70 ఏళ్ల పాలనలో పేదవాడి పేరుతో బ్యాంకు అకౌంట్ కూడా తెరిపించలేని వాళ్లు ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తారు అని ప్రధాని మోడీ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కనీసం పేదవాడి

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 07:50 AM IST
చౌకీదార్ చమత్కారం : 70ఏళ్లుగా బ్యాంకు ఖాతాలే ఇవ్వలేదు.. డబ్బులు వేస్తారా

యూపీ: 70 ఏళ్ల పాలనలో పేదవాడి పేరుతో బ్యాంకు అకౌంట్ కూడా తెరిపించలేని వాళ్లు ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తారు అని ప్రధాని మోడీ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కనీసం పేదవాడి

యూపీ: 70 ఏళ్ల పాలనలో పేదవాడి పేరుతో బ్యాంకు అకౌంట్ కూడా తెరిపించలేని వాళ్లు ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తారు అని ప్రధాని మోడీ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కనీసం పేదవాడి పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిపించలేని వాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ.. లోక్ సభ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. మీరట్ లో తొలి ఎన్నికల సభ నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన ”ప్రతి పేదవాడికి కనీస ఆదాయం’ పథకంపై ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మాటలు తనకు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. మేము ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో వాళ్లు డబ్బు వేస్తారంట.. అని మోడీ సెటైర్లు వేశారు.

బీజేపీ హయాంలో దేశంలోని ప్రతి ఒక్కరు అభివృద్ధి ఫలాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని మోడీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక భూమి మీదే కాదు అంతరిక్షంలోనూ సర్జికల్ స్ట్రయిక్స్ చేసి చూపించామన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ ర్యాంక్-వన్ పెన్షన్ తాము నెరవేర్చామన్నారు. జన్ ధన్ యోజన కింద 34 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచామని వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా జీవించాలన్నదే తమ లక్ష్యం అని మోడీ చెప్పారు.

త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తా అన్నారు. ఇటువైపు నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది.. అటువైపు ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన వారున్నారు అని కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ విమర్శించారు. మా విజన్ నవ భారత నిర్మాణం అని చెప్పారు.