Coronavirus: భారత్‌లో 24 గంటల్లో 22వేలకు పైగా కరోనా కేసులు

రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.

Coronavirus: భారత్‌లో 24 గంటల్లో 22వేలకు పైగా కరోనా కేసులు

indiawide corona cases upadate

India Coronavirus Updates: రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. మూడో వేవ్ వస్తుందంటూ వార్తలు వినిపించినా అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. భారతదేశంలో కరోనా వైరస్ కేసులలో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 22వేల 442 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో కరోనా కారణంగా దేశంలో 244 మంది చనిపోయినట్లుగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 25వేల 930 మంది కోలుకోగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 70వేల 557కి చేరుకుంది. 199 రోజుల్లో ఇదే అతి తక్కువ కావడం విశేషం. మొత్తం కోలుకున్న వ్యక్తుల సంఖ్య 3,30,94,529కి చేరుకుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 4,48,817 మంది రోగులు మరణించారు.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 90,51,75,348 వ్యాక్సిన్లు వేసినట్లుగా వెల్లడించారు వైద్య అధికారులు. దేశంలో మాత్రం ఒక్క కేరళలో మాత్రమే కేసులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 13వేల 217కేసులు నమోదవగా.. 121మంది ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే.