Mukesh Ambani: కోకాకోలా, పెప్సీకో‌లకు షాకిచ్చేలా ముఖేష్ అంబానీ భారీ ప్లాన్ ..

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ శీతల పానీయాల రంగంలో దీర్ఘకాలంగా అగ్రగామిగా ఉన్న కోకాకోలా, పెప్సీకోలను ఢీకొట్టేందుకు బ్యాటిల్ ఆఫ్ కోలాస్‌కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో 2023 సంవత్సరానికి దేశంలో రూ. 68వేల కోట్ల శీతల పానీయాల మార్కెట్ వైపు రిలయన్స్ గ్రూప్ దృష్టిసారించింది.

Mukesh Ambani: కోకాకోలా, పెప్సీకో‌లకు షాకిచ్చేలా ముఖేష్ అంబానీ భారీ ప్లాన్ ..

campa cola

Mukesh Ambani: ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబాని. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా విజయపథంలో దూసుకెళ్లాల్సిందే. టెలికాం రంగంలో తనదైన ముద్రవేసుకున్న ఈ బిలియనీర్.. 2023లో శీతల పానీయాల మార్కెట్ పై పూర్తిస్థాయి దృష్టిసారించారు. ఇప్పటికే, ఢిల్లీకి చెందిన ప్యూర్‌ డ్రింగ్‌ గ్రూప్‌ కింద ప్రతిష్టాత్మక బ్రాండ్ కోలా మార్కెట్ (కాంపా కోలా)ను రూ. 22 కోట్లతో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శీతల పానీయాల మార్కెట్‌లో దిగ్గజాలైన కోకాకోలా, పెప్సీ వంటి కంపెనీలకు షాకిచ్చేలా రిలయన్స్ గ్రూప్ భారీ ప్లాన్ చేస్తుంది.

Campa Cola : కాంపా కోలాపై అంబానీ ఫోకస్ .. ఒకప్పటి బ్రాండ్‌ని రీలాంచ్ చేయడం వెనకున్న స్ట్రాటజీ ఏంటి..?!

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ శీతల పానీయాల రంగంలో దీర్ఘకాలంగా అగ్రగామిగా ఉన్న కోకాకోలా, పెప్సీకోలను ఢీకొట్టేందుకు బ్యాటిల్ ఆఫ్ కోలాస్‌కి సిద్ధమవుతోంది. 2023 సంవత్సరానికి దేశంలో రూ. 68వేల కోట్ల శీతల పానీయాల మార్కెట్ వైపు రిలయన్స్ గ్రూప్ దృష్టిసారించింది. ఈ క్రమంలో అమెరికా కంపెనీలైన కోకాకోలా, పెప్సీకో బ్రాండ్‌ల కంటే చాలా తక్కువ ధరకు తమ శీతల పానియాల బ్రాండ్‌లను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ అవుట్ లెట్లలో కాంపాకోలా అందుబాటులో ఉంది. రెండు లీటర్ బాటిల్ జియో‌మార్ట్‌లో కాంపాకోలా రూ. 49కి లభిస్తుండగా, కోకాకోలా 1.75 లీటర్ బాటిల్ రూ.70, పెప్సీకో 2.25 లీటర్ బాటిల్ రూ. 66కి విక్రయిస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో తమ శీతలపానీయాలను తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి తేవడం ద్వారా అమెరికన్ కంపెనీలకు రిలయన్స్ గ్రూప్ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Campa Cola :  కాంపా కోలా బ్రాండెడ్ డ్రింక్‌లకు పోటీ కానుందా? పానీయాల మార్కెట్లను ముఖేశ్ అంబానీ షేక్ చేస్తారా..?

శీతలపానియాల రంగంలో అగ్రగామిగా ఉన్న కోకాకోలా, పెప్సీకోలాకు వ్యతిరేకంగా కోలాస్ యుద్ధానికి సిద్ధమవుతున్న క్రమంలో బలమైన నాయకత్వ బృందాన్ని నిర్మించుకొనేందుకు రిలయన్స్ గ్రూప్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో కోకాకోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా మాజీ ప్రెసిడెంట్ టి. కృష్ణ కుమార్‌ను నియమించుకుంది. కొన్నేళ్లుగా కోకాకోలా యొక్క మార్కెట్ విభాగంలో కృష్ణకుమార్ కీలక భూమిక పోషిస్తున్నాడు. శీతల పానీయాల మార్కెట్‌లలో సుదీర్ఘఅనుభవం ఉన్న కృష్ణ కుమార్ నియామకంతో బలమైన బృందాన్ని రియల్స్ ఏర్పాటు చేసుకుంటుంది. ద్వంద్వ వ్యూహాలతో కాంపాకోలాను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్న రిలయన్స్ గ్రూప్.. అదే సమయంలో అమెరికన్ కంపెనీలకు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.