Kedarnath Mules: కేదార్‌నాథ్ యాత్రలో మ్యూల్స్ యజమానుల పంట పండింది.. వారి ఆదాయం ఎంతో తెలుసా?

ఉత్తరా‌ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద 4,302 మ్యూల్ యాజమానులు 8,664 జంతువులను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది హెలికాప్టర్ సంస్థలు కేదార్‌నాథ్ మార్గంలో సిర్సి, ఫాటా అనే మూడు ప్రాంతాల నుండి పనిచేస్తున్నాయి. కేదార్ నాథ్ ట్రెక్ మార్గం 17 కి.మీ పొడవు ఉంటుంది.

Kedarnath Mules: కేదార్‌నాథ్ యాత్రలో మ్యూల్స్ యజమానుల పంట పండింది.. వారి ఆదాయం ఎంతో తెలుసా?

Kedarnath Mules

Kedarnath Mules: ఈ సంవత్సరం బంపర్ కేదార్ నాథ్ తీర్థయాత్రలో మ్యూల్స్(కంచర గాడిద) యాజమానుల పంట పండింది. వారి ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైంది. హెలికాప్టర్‌లను మ్యూల్స్ అధిగమించాయి. గురువారం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ పుణ్యక్షేత్రానికి 15లక్షల మంది యాత్రికులు వచ్చారు. వీరిలో 5.3లక్షల మంది ప్రయాణీకులు మ్యూల్స్ ద్వారా తమ ప్రయాణం సాగించారు.

PM Modi at Kedarnath Dham : ఉత్తరాఖండ్‌లో కనెక్టివిటీ ప్రాజెక్ట్‌‌‌కు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ .. సులభతరం కానున్న బద్రీనాథ్, కేదార్‌నాథ్ దర్శనం

ఈయాత్రలో హెలికాప్టర్లు, పాల్కీల ద్వారా ప్రయాణికులను తరలించేందుకు వచ్చిన ఆదాయం కంటే మ్యూల్స్ యాజమానులకు వచ్చిన ఆదాయం ఎక్కువ. వివరాల ప్రకారం.. హెలికాప్టర్ల ద్వారా ప్రయాణికులను తరలించగా వచ్చిన ఆదాయం రూ. 75 నుంచి 80 కోట్లు. దానితో పోలిస్తే మ్యూల్స్ యాజమానులుకు వచ్చిన ఆదాయం రూ. 101.3 కోట్లుగా అంచనా. అయితే ఈ సీజన్ లో పల్కీ- పల్లకి యాజమానులు రూ. 86లక్షలు ఆర్జించారు. వీటన్నింటిని కలుపుకుంటే ఈ సీజన్ లో కేధార్ నాథ్ యాత్రలో మొత్తం ఆధాయం రూ. 190కోట్లు పైమాటే.

bumper Kedar yatra

bumper Kedar yatra

ఉత్తరా ఖండ్ ప్రభుత్వం వద్ద 4,302 మ్యూల్ యాజమానులు 8,664 జంతువులను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తొమ్మిది హెలికాప్టర్ సంస్థలు కేదార్‌నాథ్ మార్గంలో సిర్సి, ఫాటా అనే మూడు ప్రాంతాల నుండి పనిచేస్తున్నాయి. కేదార్ నాథ్ ట్రెక్ మార్గం 17 కి.మీ పొడవు ఉంటుంది. యమునోత్రి పుణ్యక్షేత్రం 5 కి.మీ. యమునోత్రి మార్గంలో మ్యూల్ యాజమానులు, ఛాపర్ సంస్థలు, పల్కీ యాజమానులు కలిపి మొత్తం రూ. 211కోట్లు. అయితే ప్రభుత్వానికి పన్నులు, రిజిస్ట్రేషన్ రుసుము రూపంలో రూ. 8కోట్లు వెళ్తుంది. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ మేనేజింగ్ డైరెక్టర్ తివారీ మాట్లాడుతూ.. నవంబర్ 19 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఇప్పటి వరకు రూ. 40కోట్లను గర్వాల్ మండల వికాస్ నిగమ్ ఆర్జించింది. యాత్ర పూర్తయ్యే సరికి రూ. 50కోట్లు మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.

Kedarnath Mules

Kedarnath Mules

గుప్తకాశీ – కేదార్ నాథ్ మార్గంలో హెలికాప్టర్ లో ప్రయాణించాలంటే రూ. 7,750 ఖర్చు అవుతుంది. ఫాటా నుండి కేదార్ నాథ్ వరకు ఒక రౌండ్ ట్రిప్ ధర రూ. 4,720. అదేవిధంగా సిర్సి – కేదార్ నాథ్ మార్గంలో రూ. 4,680, పోనీ రైడ్ కు ఒక్కో వ్యక్తి రూ. 2,500 నుంచి రూ.5వందల వరకు జంతువును అద్దెకు తీసుకున్న దూరాన్ని బట్టి ఉంటుంది.