Mumbai : మీ వద్ద కరోనా మందులు మిగిలిపోయాయా ? మాకివ్వండి..మేము తీసుకుంటాం

ముంబైలో మార్కస్‌ రాన్నీ, రైనాలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ వైద్యులు. ఈ దంపతులు..ఈ మే 1న మెడ్స్‌ ఫర్‌ మోర్‌ అనే సంస్థను ప్రారంభించారు.

Mumbai : మీ వద్ద కరోనా మందులు మిగిలిపోయాయా ? మాకివ్వండి..మేము తీసుకుంటాం

Covid 19

Doctor Couple Collects : ప్రస్తుతం కరోనా ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.

సాధారణంగా..ఏదైనా వ్యాధి రాగానే..మందులను వాడుతుంటాం. వ్యాధి తగ్గగానే..మందులను పక్కన పడేస్తుంటాం. కరోనా సోకిన వారు…కొన్ని మందులను వాడి..వ్యాధి నుంచి బయటపడుతున్నారు. అయితే..ఇలా వాడిన మందులు కొన్ని మిగిలిపోతుంటాయి. ఇలాంటి మందులను తమకు ఇవ్వాలని..తాము తీసుకుంటామని ఓ డాక్టర్స్ జంట అంటోంది.

ముంబైలో మార్కస్‌ రాన్నీ, రైనాలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ వైద్యులు. ఈ దంపతులు..ఈ మే 1న మెడ్స్‌ ఫర్‌ మోర్‌ అనే సంస్థను ప్రారంభించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు తమ దగ్గరున్న మందులను ఇవ్వాలని ఈ సంస్థ సూచిస్తోంది. పది రోజుల క్రితం ఈ సంస్థ ప్రారంభమైంది. 10 రోజుల్లో 20 కిలోగ్రాముల కోవిడ్‌ మందులను కోలుకున్న వారి నుంచి సేకరించింది. ఇలా సేకరించిన మందులను అవసరమైన రోగులకు అందిస్తున్నారు.

తమ వద్ద పని చేసే వైద్య సిబ్బంది కుటుంబసభ్యుల్లో ఒకరు కరోనా సోకింది. ఈ సమయంలో మందులు కావాల్సి వచ్చింది. కోలుకున్న అనంతరం మందులు వృధా అవుతున్నాయనే తమ దృష్టికి వచ్చిందన్నారు ఆ వైద్య దంపతులు. ఇరుగుపొరుగు సహాయంతో కోవిడ్‌ మందులు సేకరించడానికి ఈ మిషన్‌ను ప్రారంభించామన్నారు.

పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు ఈ మందులను విరాళంగా అందచేస్తామన్నారు. యాంటీ బయాటిక్స్, ఫాబిఫ్లు, పెయిన్‌ కిల్లర్‌, స్టెరాయిడ్లు, ఇన్హేలర్లు, విటమిన్లు, యాంటాసిడ్లు వంటి అన్ని రకాల ఔషధాలను మెడ్స్ ఫర్ మోర్ సేకరిస్తోంది.Mumbai Doctor Couple Collects 20 Kg Of Unused Covid Medicines