దత్త పుత్రికకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసిన ముస్లిం దంపతులు

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 04:58 AM IST
దత్త పుత్రికకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసిన ముస్లిం దంపతులు

భారతదేశం పలుమతాల వారు కలిసిమెసి ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారత్ సొంతం. అటువంటి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది కేరళలోని కాసరగోడ్ సిటీ. హిందూ బాలికను ముస్లిం దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ బాలిక పెరిగి పెద్దదైంది. కన్నబిడ్డకంటే ఎక్కువగా పెంచుకున్న ఆ బాలిక పెళ్లి వయస్సు రావటంతో ఆ ముస్లిం దంపతులు ఆమెకు హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేశారు.

వివరాల్లోకి వెళితే..ముస్లిం మత సంప్రదాయాలు..కట్టుబాట్లు చాలా చాలా కఠినంగా ఉంటాయి. అయినాసరే హిందూ ముస్లిం భాయీ భాయీ అనే నినాదాన్ని ఎక్కడా మరచిపోరు ముస్లిం సోదరులు. అటువంటి పెద్ద మనస్సు కలిగిన ఓ ముస్లిం దంపతులు అబ్దుల్లా, ఖదీజా. 

కాసర్‌గోడ్‌కు చెందిన అబ్దుల్లా, ఖదీజా దంపతుల రాజేశ్వరి తండ్రి పొలం పనులు చేసేవాడు. ప్రతీరోజులాగానే పొలం పనుల కోసం పొలం వెళ్లారు. అప్పుడే రాజేశ్వరి అనే బాలిక కనిపించింది. రాజేశ్వరి చిన్నప్పుడే అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు.తరువాత కొంతకాలానికి తల్లి కూడా చనిపోయింది. తరువాత బంధువులు రాజేశ్వరిని పట్టించుకోలేదు. దీంతో అనాధగా మారిపోయిన రాజేశ్వరిని అబ్దుల్లా, ఖదీజ దంపతులు ఇంటికి తీసుకొచ్చారు. తరువాత దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి రాజేశ్వరిని అబ్దుల్లా దంపతులు కంటికి రెప్పలా పెంచుకున్నారు.

అబ్దుల్లా దంపతులకు అప్పటికే షమీమ్‌, నజీబ్‌, షరీఫ్‌ అనే ముగ్గురు కొడుకులున్నారు. వారితోపాటే రాజేశ్వరిని కూడా అబ్దుల్లా దంపతులు కన్నకూతురులా పెంచారు. షమీమ్‌, నజీబ్‌, షరీఫ్‌ లు కూడా రాజేశ్వరిని సొంతచెల్లెలిలా చూసుకునేవారు. దీన్ని స్థానిక ముస్లిం సోదరులుగానీ..వారి బంధుమిత్రులు గానీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయకపోవటం మరో విశేషం. 

ఇప్పుడు రాజేశ్వరి పెళ్లీడుకు వచ్చింది. దీంతో అబ్దుల్లా దంపతులు మంచి సంబంధం కోసం వెదికారు. విష్ణు్ ప్రసాద్‌ అనే హిందూ అబ్బాయితో పెళ్లికుదిర్చి హిందూ సంప్రదాయంలోనే అబ్దుల్లా దంపతులు కాళ్లు కడిగి..కన్యాదానం చేశారు. విష్టుప్రసాద్ తరపున హిందూ బంధుమిత్రులు, రాజేశ్వరి తరఫున వచ్చిన ముస్లిం బంధుమిత్రుల సమక్షంలో..ఎటువంటి కులమతాలకు ఆటంకం చెప్పని  కన్హాగడ్‌లోని భగవతి దేవాలయంలో ఈ పెండ్లి కన్నులపండువలా జరిగింది. కాగా..ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అబ్దుల్లా దంపతుల ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు. 

అదే భారతదేశం గొప్పదనం.భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం భారత్ సొంతం. అక్కడక్కడా కులపిచ్చిలు ఈనాటికీ కనిపిస్తున్నా..ఇటువంటి మతసామరస్యం ఘటనలు చాలా చాలా సందర్భాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో కూడా మతసామరస్యంతో హిందూ ముస్లింలు ఒకరికొరకు సహాయ సహకారాలు అందించుకుని ఒకరి ప్రాణాలు మరొకరు కాపాడుకున్న ఘటనలు జరగటం భారత్ లో మతసామరస్యానికి ప్రతీక అని చెప్పుకోవటానికి ఎటువంటి సందేహం లేదు. లేనే లేదు..

See Also | ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి ఎంట్రీ ?