ముస్లిం శుభలేఖపై వినాయకుడు,రాధాకృష్ణుల బొమ్మలు

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 10:25 AM IST
ముస్లిం శుభలేఖపై వినాయకుడు,రాధాకృష్ణుల బొమ్మలు

ముస్లింల పెళ్లి శుభలేఖలపై తెలుగు దేవుళ్ల బొమ్మలు ముద్రించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటే అపురూపమైన దేశం. హిందూ ముస్లిం భాయీ..భాయీ అనే మత సామరస్యం చాలా సందర్భాలలో మనం వింటున్నాం..చూస్తున్నాం..అటువంటివే ఈ శుభలేఖలు. 

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ మీరట్లోని హిస్తినాపూర్ ప్రాంతంలో నివాసముంటే మొహద్ సారఫత్ అనే ముస్లిం  తన కుమార్తె అస్మా ఖాటూన్  పెళ్లి చేస్తున్నాడు. మార్చి 4న ఈ వివాహం జరగనుంది.  ఈ పెళ్లి శుభలేఖలో హిందూ-ముస్లిం స్నేహాన్ని చాటి చెప్పేందుకు శుభలేఖల్లో హిందూ దేవుళ్లైన వినాయకుడు..రాధాకృష్ణుల బొమ్మలను ప్రింట్ చేయించాడు. 

See Also | రీల్ లైఫ్ పేరుతో రియల్ లైఫ్‌లో.

ఈ సందర్భంగా మొహద్ సారాఫత్ మాట్లాడుతూ..నాకు చాలామంది హిందువులు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు. మత విద్వేషాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఇటువంటి సమయంలో నా కూతురు శుభలేఖలపై హిందూ దేవుళ్ల బొమ్మలు వేయించినందుకు నా స్నేహితులు..బంధువులు కూడా చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

మా స్నేహితులం అంతా హిందూ ముస్లింలనే తేడాలు లేకుండా స్నేహంగా ఉంటామని అందుకనే హిందూ-ముస్లింల స్నేహసంబంధాలను ఇలా నా కూతురు పెళ్లి పత్రికల్లో హిందూ దేవుళ్ల బొమ్మలను ప్రింట్ చేయించానని..ఇది చూసిన నాస్నేహితులు చాలా సంతోషించారని వారి ఆనందం చూసిన నాకు చాలా చాలా సంతోషం కలిగిందని  తెలిపారు. 

అలాగే నా బంధువులు..స్నేహితుల కోసం ఉర్ధూ, హిందీల్లో కూడా వెడ్డింగ్ కార్డ్స్ తయారు చేయించాననీ..మొహద్ సారాఫత్ తెలిపారు.