Gujarat: లవ్ జిహాదీ ఆరోపణలతో ముస్లిం విద్యార్థులపై అమానవీయ దాడి

ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మహవీర్ యూనివర్సిటీ రిజిస్టార్ విజయ్ మటవాలా స్పందిస్తూ లవ్ జిహాదీ లాంటివి అక్కడేమీ జరగడం లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు

Gujarat: లవ్ జిహాదీ ఆరోపణలతో ముస్లిం విద్యార్థులపై అమానవీయ దాడి

Muslim students beaten in Guj over love jihad allegations

Gujarat: ఒక కాలేజీలో ముగ్గురు ముస్లిం విద్యార్థులపై పట్ట పగలే కొందరు తీవ్ర దాడికి దిగారు. ముఖాలకు రుమాలు కట్టుకుని వచ్చిన వాళ్లు.. ముగ్గురు ముస్లిం విద్యార్థుల్ని చుట్టుముట్టి అమానవీయంగా చావబాదారు. ఈ తంతంగం అంతా సహ విద్యార్థులు తమ మొబైల్ కెమెరాల్లో రికార్డు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‭లో ఉన్న మహవీర్ యూనివర్సిటీలో బుధవారం జరిగిన సంఘటన ఇది. దాడికి పాల్పడ్డ వారు వివ్వహిందూ పరిషద్‭కు చెందిన వారని గుర్తించారు. లవ్ జిహాదీ ఆరోపణలతో వారిపై దాడికి పాల్పడ్డట్టారట. అయితే లవ్ జిహాదీ ఆరోపణలు కాలేజీ యాజమాన్యం కొట్టి పారేసింది.

Vishva Hindu Parishad (VHP) Goons brutally assaulted three Muslim students at the campus of Bhagwan Mahaveer College in Gujarat’s Surat Accuse them for love j!had where Management denied Allegation of Love J!had pic.twitter.com/PasgHRILzC


వీడియో ప్రకారం.. ముఖానికి రుమాలు కట్టుకున్న కొందరు వ్యక్తులు (అందులో కొందరికి వారికి కాలేజీ బ్యాగులు ఉన్నాయి) ముగ్గురు వ్యక్తుల్ని గుంపులు గుంపులుగా చుట్టుముట్టి కిరాతకంగా కొట్టారు. రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు రికార్డైన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై మహవీర్ యూనివర్సిటీ రిజిస్టార్ విజయ్ మటవాలా స్పందిస్తూ లవ్ జిహాదీ లాంటివి అక్కడేమీ జరగడం లేదని, అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. దాడికి పాల్పడ్డ వారికి గర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విజయ్ మటవాలా అన్నారు.