మళ్లీ స్ట్రిక్ట్ రూల్స్ : కరోనా విజృంభణతో ఆరెంజ్ సిటీలో ఆంక్షల సడలింపు ఉపసంహరణ

నాగ్ పూర్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్న సమయంలో మహారాష్ట్రలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో ఇచ్చిన పలు ఆంక్షల సడలింపులను ఇప్పుడు ఉపసంహరించుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నాగ్ పూర్ లో కఠినమైన రూల్స్ అమల్లో ఉంటాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం నాగ్ పూర్ లో ఇప్పటివరకు 460 కరోనా కేసులు 7మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 44వేలు దాటింది. ఆ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా 1,517కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలోని కరోనా మరణాల్లో దాదాపు 40శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇక కేసుల్లో కూడా దేశంలోనే నెం.1స్థానంలో మహారాష్ట్ర నిలిచింది.
నాగ్ పూర్ లో స్ట్రిక్ట్ రూల్స్
-ప్రేవేట్ ఆఫీసులు యధావిధిగా మూసివేయబడి ఉంటాయి
-ప్రభుత్వ ఆఫీసుల్లోకి 5శాతం ఉద్యోగులకే అనుమతి. గరిష్ఠంగా 10మంది ఉద్యోగులే ఉండాలి
-ట్యాక్సీ సర్వీసులు రద్దుౌ
-నైట్ కర్ఫ్యూ సిటీలో రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కొనసాగుతుంది
-నైట్ కర్ఫ్యూ సమయంలో కేవలం ఎసెన్సియల్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
Read: 4ఏళ్ల బాలుడి ప్రాణాలు నిలిపిన ‘Bone Marrow’ దాతను తొలిసారి కలిసిన వేళ..