G20 Summit 2023: ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు: భారత్ ప్రకటన

పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

G20 Summit 2023: ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు: భారత్ ప్రకటన

G20 Summit 2023

G20 Summit 2023 – New Delhi: న్యూ ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో పలు డిక్లరేషన్లు చేశారు. ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనిపై సభ్యదేశాలన్నీ పనిచేయాలని, జీవ ఇంధనాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భారత్ సూచించింది.

పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు. లేకపోతే సరికొత్త ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ పనులు చేస్తే పర్యావరణ పరిరక్షణకు కృచేస్తూనే… ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూసుకోవచ్చని తెలిపారు.

ప్రపంచంలో పర్యావరణంలో భారీగా మార్పులు సంభవిస్తున్న వేళ ఇంధన పరివర్తన 21వ శతాబ్దానికి చాలా ముఖ్యమని చెప్పారు. అలాగే, సమ్మిళిత ఇంధన పరివర్తనకు చాలా ఖర్చు అవుతుందని అన్నారు.

పర్యావరణం పరిరక్షణ కోసం 100 బిలియన్ డాలర్లు వ్యయం చేసేందుకు గతంలో తీసుకున్న నిర్ణయంపై నిబద్ధతతో పనిచేస్తామని పలు దేశాలు ప్రకటించాయని తెలిపారు. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జీ20 డిక్లరేషన్ కు అన్ని దేశాలు అంగీకరించడం శుభ పరిణామమని చెప్పారు.

Akshata Murty : రిషి సునక్ భార్య అక్షతామూర్తి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?