Corona Cases : దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. 555 మంది మృతి

భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు.

Corona Cases : దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. 555 మంది మృతి

Corona Cases (7)

Corona Cases : భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 555 మంది కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని దేశంలో ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇప్పటి వరకు దేశంలో 3.07 కోట్ల మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటలలో 42,360 మంది కొలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 45.60 కోట్లమందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తైంది. ఇక దేశంలో అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి, ఇక్కడ లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక గురువారం 22,064 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో 7,242 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్రలలో సరిహద్దు కలిగి ఉన్న కర్ణాటకలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. 19 రోజుల తర్వాత కర్ణాటకలో 2000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇదిలా ఉంటే అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.