80 ఏళ్ల బామ్మ..ఏడాది ఆదాయం రూ. 1.7 లక్షలు..అకౌంట్లో మాత్రం రూ. 196 కోట్లు

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 01:27 PM IST
80 ఏళ్ల బామ్మ..ఏడాది ఆదాయం రూ. 1.7 లక్షలు..అకౌంట్లో మాత్రం రూ. 196 కోట్లు

బామ్మ వయస్సు 80 ఏళ్లు..ఓ ట్రస్టుకు లబ్దిదారు. ఏడాదికి ఆదాయం 1.7 లక్షలు మాత్రమే. కానీ ఆమె అకౌంట్ పరిశీలిస్తే..మాత్రం షాక్ తిన్నారు అధికారులు. ఎందుకంటే..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 196 కోట్లు ఉన్నట్లు తేలడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇంత డబ్బు ఎక్కడిది అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరగలేదు. భారతదేశంలోని ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో రేణు తరణి నివాసం ఉంటున్నారు. తరణి ఫ్యామిలీ ట్రస్టు పేరిట ఉన్న ఖాతాకు ఆమె లబ్దిదారు. HSBC Jeniva బ్రాంచీలో ఖాతా ఉంది.

ఆమె పేరిట జెనివాలో ఉన్న (స్విస్) HSBC బ్రాంచ్ లో ఖాతా ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఖాతాలో ఏకంగా రూ. 196 కోట్లు ఉన్నట్లు తేలింది. చాలా తక్కువ వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎలా జమ అయ్యిందో అధికారులకు అర్థం కావడం లేదు.

2004లో కేమన్ దీవులకు చెందిన జీ డబ్ల్యూ ఇన్వెస్ట్ మెంట్ పేరిట ప్రారంభించబడింది. ఈ ఖాతాను ట్రస్టు నిర్వాహకుడిగా బదిలీ చేసింది. 2005-06 IT శాఖకు ఆమె ఫైల్ చేసిన రిటర్న్ లో తనకున్న బ్యాంకు ఖాతా, తదితర వివరాలను వెల్లడించలేదు.

2014, అక్టోబర్ 31న కేసు ఫైల్ చేశారు. తనకు జెనీవా HSBCలో బ్యాంకు ఖాతా లేదని, GW Investment Bank లో డైరెక్టర్, వాటాదారు కాదంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు తాను ప్రవాసిగా వెల్లడించారు. 2005 – 06 తన వార్షిక ఆదాయం రూ. 1.7 లక్షలు ఐటీకి వెల్లడించారు.

బెంగళూరుకు సంబంధించిన ఓ చిరునామా ఇచ్చారు. క్రమం తప్పకుండా ఆదాయం కడుతున్నట్లు చెప్పారు. తనకు తాను భారతీయ పన్ను చెల్లింపుదారుగా తెలిపారు. అయితే..ఇంత తక్కువ వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ గుర్తించలేకపోయింది. పన్నుతో పాటు జరిమాన కట్టాలని Income Tax Appellate Tribunal (ITAT)