No Vaccine, No Alcohol : కొత్త రూల్.. నో వ్యాక్సిన్, నో లిక్కర్.. మందుబాబులకు షాక్

కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి.

No Vaccine, No Alcohol : కొత్త రూల్.. నో వ్యాక్సిన్, నో లిక్కర్.. మందుబాబులకు షాక్

No Covid Vaccine, No Liquor

No Covid Vaccine, No Liquor : కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని చోట్ల టీకా తీసుకుంటే నగదు ప్రోత్సహాకాలు ఇస్తున్నారు. అక్కడ మాత్రం కొత్త రూల్ తెచ్చారు. మందుబాబులకు షాక్ ఇచ్చారు. అదేంటంటే.. నో వ్యాక్సిన్, నో లిక్కర్.

అవును, టీకా తీసుకోకుంటే లిక్కర్ ఇవ్వరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లా యంత్రాంగం ఈ రూల్ తెచ్చింది. లిక్కర్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని లిక్కర్ షాపు యజమానులకు అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు అన్ని లిక్కర్ షాపుల బయట పోస్టర్లు అతికించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్ముతామని అందులో ఉంది.

ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి మాత్రమే లిక్కర్ అమ్మాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మాకు ఆదేశాలు ఇచ్చారు అని లిక్కర్ షాపుల యజమానులు తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 13వేల 777 కరోనా కేసులు నమోదయ్యాయి. 279మంది కరోనాకు బలయ్యారు. 13వేల 200మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఛత్తీస్ గఢ్ లో సైతం ఇలాంటి రూల్ ఒకటి తెచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని సిబ్బందికి జీతం ఇచ్చేది లేదని అధికారులు చెప్పారు. గరేలా పెండ్రా మర్వాహి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మస్రమ్.. మే 21న ఈ రూల్ పాస్ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆఫీసులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్ లో పని చేసే సిబ్బంది అంతా వ్యాక్సినేషన్ కార్డులను ఆఫీస్ లో సబ్మిట్ చేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది.. అంతా వ్యాక్సిన్ తీసుకోవాలి. వంద శాతం వ్యాక్సినేషన్ సాధించడమే దీని వెనుకున్న లక్ష్యమని అధికారులు చెప్పారు.