కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై….రాహుల్ సంచలన నిర్ణయం

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2020 / 09:02 AM IST
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై….రాహుల్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకత్వ లేమి సృష్టంగా కనిపిస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేరుస్తాడు అని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకుల ఆశలు ఒక్క సమాధానంతో అడియాశలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టే ప్రశక్తే ఇక లేదని,ఇందులో వేరే ప్రశ్నే లేదని స్వయంగా రాహుల్ గాంధీ తేల్చి చేప్పేశారు. ఈ విషయాన్ని రాహుల్ సన్నిహితులు మీడియాకు తెలిపారు.

ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయకత్వ లేమి సృష్టంగా కన్పిస్తోంది. ఈ సమయంలో మోడీ లాంటి చరిష్మాటిక్ లీడర్ ని ఢీ కొట్టే సత్తా కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భావిస్తున్నారు.(హోలీ వేడుకలకు మీరూ దూరంగా ఉండండి : మోడీ)

అయితే 2017లో తన తల్లి సోనియాగాంధీ తప్పుకోవడంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఏప్రిల్ లో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంపై రాహుల్ ప్రకటన చేయనున్నారని,తిరిగి అధ్యక్ష బాధ్యతలను రాహుల్ చేపట్టబోతున్నారంటూ ఇప్పటివరకు వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే.

అయితే తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రశక్తే ఉండబోదని రాహుల్ తేల్చిచెప్పినట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు డీలా పడ్డారు. ప్రస్తుతం తాత్కాలిక కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా సోనియాగాంధీ కొనసాగుతున్న విసయం తెలిసిందే.

మరోవైపు మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ భయం పట్టుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తోందని,కొంతమందిని ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి పరిమితం చేశారని కమల్ నాథ్ సర్కార్ ఆరోపిస్తోంది. ఇటువంటి పరిస్థితులను హైకమాండ్ ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి మరి.