Bhagwant Mann: ఎమ్మెల్యేల రికమండేషన్లు చేయడానికి వీల్లేదు – సీఎం

పంజాబ్ సీఎం భగవంత్ మన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయతీతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని పలు విభాగాల వారీగా 25వేల ఉద్యోగాలకు..

Bhagwant Mann: ఎమ్మెల్యేల రికమండేషన్లు చేయడానికి వీల్లేదు – సీఎం

Bhagawant Mann

Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయతీతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని పలు విభాగాల వారీగా 25వేల ఉద్యోగాలకు శనివారం జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదం తెలిపారు. దీని గురించి మాట్లాడిన ఆయన విడుదల చేయనున్న ఉద్యోగాల్లో భర్తీ కోసం ఎమ్మెల్యేలు ఎటువంటి రికమండేషన్లు చేయడానికి వీల్లేదని చెప్పారు.

‘ఈ ఉద్యోగాలకోసం చాలా మంది మిమ్మల్ని కలవొచ్చు. వాటన్నిటినీ (రికమండేషన్లు) పక్కకు పెట్టేయండి. ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతికి చోటు లేదు’ అని మన్ అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ ప్రధాన సమస్యగా నిరుద్యోగం గురించి చెప్పింది. ఇప్పుడు దీని గురించే కృషి చేయాలని నడుంబిగించింది.

పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భగవంత్ మన్ పనితీరును కొనియాడారు. మూడ్రోజుల్లోనే చాలా వరకూ కవర్ చేశారని అభినందించారు. పంజాబ్ లో ప్రభుత్వం పని మొదలుపెట్టేసిందని అన్నారు కేజ్రీవాల్.

Read Also: భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రూ.2 కోట్లు ఖర్చు: గోధుమ పంట నాశనం

ఆప్ ఎమ్మెల్యేలు మొహాలీలో మీటింగ్ అయిన సమయంలో కేజ్రీవాల్ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి వాళ్లతో మాట్లాడారు.

అంతకంటే కొద్ది రోజుల ముందే మన్.. పంజాబ్‌లో యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ ను మొదలుపెడతామని మార్చి 23నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. దాని ద్వారా అవినీతికి పాల్పడుతున్న వారి వీడియో లేదా ఫొటోలను నేరుగా అప్ లోడ్ చేసి లంచగొండితనాన్ని అరికట్టొచ్చని సూచించారు.

మార్చి 16న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మన్.. శనివారం పది మంది ఆప్ ఎమ్మెల్యేలను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 92/117 విజయంతో ఆప్ అఖండ విజయాన్ని నమోదుచేసింది.