GST Council : బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌‌పై నో ట్యాక్స్..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం మాట్లాడుతూ.. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించామని వెల్లడించారు. అలాగే బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌‌పై ట్యాక్స్ మినహాయిస్తున్నామని..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ కొనసాగుతుందని వెల్లడించారు.

GST Council : బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌‌పై నో ట్యాక్స్..కొవిడ్ వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ..

No Tax On Black Fungus Medicine 5 Gst To Continue On Covid Vaccines

GST Council Decisions Today: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయాలు చాలా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సమావేశం అనంతరం మంత్రి భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. సింగిల్ అజెండాతో జీఎస్టీ మండలి సమావేశం జరిగిందని తెలిపారు. కరోనా ఔషధాలు, పరికరాలపై పన్నులు తగ్గించామని వెల్లడించారు.

ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నవారిపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే మందులపై శుభవార్త చెప్పారు మంత్రి. బ్లాక్ ఫంగస్ చికిత్స్ కోసం వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లపై జీఎస్టీ మినహాయింపు ఉంటుందని తెలిపారు. అలాగే
ఆక్సిజన్ యూనిట్లు, టెస్టింగ్ కిట్లు, పల్స్ ఆక్సీమీటర్లపై జీఎస్టీ తగ్గింపు ఉంటుందనీ..ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు.

కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 3 రకాల మందులపై కూడా జీఎస్టీ తగ్గింపునిస్తున్నామని తెలిపిన మంత్రి..వ్యాక్సిన్, టెంపరేచర్ కొలిచే పరికరాలపై 5 శాతం జీఎస్టీ యథాతథంగా కొనసాగుతుందని అన్నారు. అంబులెన్సులపై 12 శాతం జీఎస్టీ తగ్గింపు.శ్మశాన వాటికల్లో వినియోగించే ఎలక్ట్రిక్ ఫర్నెస్ (విద్యుత్ ఆధారిత దహన వేదికలు)లపై 5 శాతం జీఎఈస్టీ తగ్గింపు ఉంటుందని ప్రకటించారు. అలాగే హ్యాండ్ శానిటైజర్లపై జీఎస్టీ కుదిస్తున్నామని తెలిపారు. మొత్తానికి కరోనా చికత్సలు..బ్లాక్ ఫంగస్ చికిత్సలు ప్రజలను పలు కష్టాల్లోకి నెడుతున్న క్రమంలో మంత్రి ప్రకటించిన కరోనా చికిత్సలకు వాడే పరికరాలు..మందుల విషయంలో ఆచీ తూచీ నిర్ణయాలుతీసుకున్నట్లుగా తెలుస్తోంది.