ఫోన్ పే, గూగుల్ పేలలో చెల్లింపులు ఉచితమే.. NPCI క్లారిటీ!

డిజిటల్ చెల్లింపులు చేసే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI) ప్లాట్‌ఫాంలలో చెల్లింపులకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI). జనవరి 1, 2021 నుంచి డిజిటల్ చెల్లిపులకు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని వెల్లడించింది NPCI.
ప్రస్తుతం యూపీఐ నుంచి చేసే నగదు చెల్లింపులకు ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయట్లేదని, కరోనా కారణంగా 2020 సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగినట్లుగా NPCI స్పష్టం చేసింది. 2008లో ప్రారంభమైన NPCI సంస్థ భారతదేశంలో రిటైల్ చెల్లింపులను నిర్వహిస్తోంది.
2021 జనవరి 1 నుండి UPI చెల్లింపు సేవలపై – థర్డ్ పార్టీ-యాప్ ప్రొవైడర్లు(ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే)పై NPCI అదనపు ఛార్జీలు విధిస్తుందని చాలా వార్తా మీడియా సంస్థలు నివేదించాయి. అయితే అవన్నీ పుకార్లే అని, అందులో వాస్తవం లేదని లేటెస్ట్‌గా NPCI క్లారిటీ ఇచ్చింది.