West Bengal Bus Accident : ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రులను తరలిస్తుండగా.. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయాలు
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.

Bus accident
Odisha Train Accident Victims : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనలో గాయపడిన ప్రయాణికులు మళ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రైలు ప్రమాద క్షతగాత్రులు బస్సు ప్రమాదంలో మరోసారి గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ కు చెందిన కొంతమంది ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు.
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది. పికప్ వాహనాన్ని ఆ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి బస్సు ప్రమాదంలో మరోసారి గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రైళ్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి గాయాలతో తమ ఊర్లకు వెళ్తోన్న ప్రయాణికులు మరోసారి బస్సు ప్రమాదంలో గాయపడటం స్థానికంగా కలకలం రేపింది.
ఒడిశాలోని బలాసోర్ సమీపంలో శుక్రవారం లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాన్ని కంపార్ట్ మెంట్ లు మెయిన్ లైన్ పై పడ్డాయి.
అయితే కొన్ని నిమిషాల్లోనే మెయిన్ లైన్ లో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది చనిపోగా, 803 మందికి గాయాలు అయ్యాయి.