Omicron Variant: ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అడ్డుకునే క్రమంలో యాంటీబాడీలను గుర్తించారు శాస్త్రవేత్తలు. మానవశరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై....

Omicron Variant: ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు

Omicron Case

Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అడ్డుకునే క్రమంలో యాంటీబాడీలను గుర్తించారు శాస్త్రవేత్తలు. మానవశరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై ఈ యాంటీబాడీలు పనిచేస్తాయని తెలుసుకున్నారు. ఈ స్టడీకి సంబంధించిన వివరాలు జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. స్టడీలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో వేరియంట్లను అడ్డుకోవడానికి టీకాల తయారీకి, ట్రీట్మెంట్ కు ఉపయోగపడతాయని రీసెర్చర్స్ భావిస్తున్నారు.

స్పైక్‌ ప్రొటీన్‌లో అత్యధిక సేఫ్టీ మధ్య ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ఈ యాంటీబాడీలు ఉంటాయన్నారు. ఫలితంగా వైరస్‌ మ్యూటేషన్‌ చెందినప్పటికీ పనితీరును అడ్డుకోలేదని ప్రొఫెసర్‌ డేవిడ్‌ వీజ్లర్‌ వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీ చికిత్సలో వాడే యాంటీబాడీలను రీసెర్చర్స్ అనలైజ్ చేశారు. వీటిలో సొట్రోవిమాబ్‌ అనే యాంటీబాడీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని, ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావాన్ని 3 రెట్లు అధికంగా తగ్గిస్తుందని గుర్తించారు.

గత వేరియంట్లకు వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీల్లో 4 తరగతులకు చెందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకునే సామర్ధ్యంతో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ యాంటీబాడీలు కేవలం కరోనా వైరస్‌ కాకుండా సార్బెకోవైరస్‌ జాతి వైరస్‌లన్నింటి స్పైక్‌ప్రొటీన్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి : అనంతలో రోడ్డు ప్రమాదం.. నీటమునిగి వ్యక్తి మృతి

తాజాగా ఉద్భవించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో 37 మ్యూటేషన్స్ గుర్తించారు. ఈ స్పైక్‌ ప్రొటీన్‌ ఆధారంగానే వైరస్‌ మానవ కణాల్లోకి వెళ్లగలుగుతుంది. మ్యూటేషన్ల కారణంగానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపించడంతో పాటు ఇమ్యూనిటీని డామినేట్ చేస్తుంది.

స్పైక్‌ ప్రొటీన్లు ఏవిధంగా మానవ శరీర కణాలకు అతుకుంటున్నాయో, కణాల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయో పరిశీలించారు. మానవ శరీర కణాలపై ఉండే ఏసీఈ2 రిసెప్టార్‌ ప్రొటీన్‌కు ఈ స్పైక్‌ప్రొటీన్స్‌ అతుక్కోవడం ద్వారా వైరస్‌ను కణాల్లోకి పంపుతాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ 2.4 రెట్లు అధిక సామర్ధ్యంతో ఏసీఈ2 ప్రోటీన్‌ రిసెప్టార్‌ను అతుక్కోగలదని పరిశోధనలో తేలింది. అలా ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుంది.

ఒక్క డోసు టీకా తీసుకున్నవారి కంటే రెండు డోసులు టీకా తీసుకున్నవారిలో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ కెపాసిటీ శక్తి 5రెట్లు తక్కువని పరిశోధనలో తెలిసింది. బూస్టర్‌ డోసు తీసుకున్నవారిలో టీకాల కెపాసిటీ తగ్గడమనేది మరింత తగ్గుతుందని తెలిసింది. అలా బూస్టర్‌ డోసు ఒమిక్రాన్‌ నిరోధంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి : శరీరంలో వేడిని తగ్గించే చిట్కాలు…