Bengaluru: బైక్ ట్యాక్సీ రైడర్‌పై ఆటో డ్రైవర్ దాడికి యత్నం.. ఫోన్ ధ్వంసం చేసి బెదిరింపులు.. వైరల్ వీడియో

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్రైవర్ ఆపాడు. అతడి చేతిలోని ఫోన్ తీసుకుని, నేలకేసి పగలగొట్టాడు.

Bengaluru: బైక్ ట్యాక్సీ రైడర్‌పై ఆటో డ్రైవర్ దాడికి యత్నం.. ఫోన్ ధ్వంసం చేసి బెదిరింపులు.. వైరల్ వీడియో

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ట్యాక్సీ రైడర్‌పై ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు.. అతడిని తిడుతూ, బెదిరిస్తూ కొట్టబోయాడు. అది కూడా వీడియో సాక్షిగా చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బెంగళూరు అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపైనే పోలీసులు స్పందించారు. ఈ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన మెట్రో దగ్గర ఒక బైక్ ట్యాక్సీ నడుపుతున్న యువకుడిని ఆటో డ్రైవర్ ఆపాడు. అతడి చేతిలోని ఫోన్ తీసుకుని, నేలకేసి పగలగొట్టాడు. ‘‘అనుమతి లేకుండా ర్యాపిడో బైక్స్ రోడ్లపై ఎలా తిరుగుతున్నాయో చూడండి. ఇతడ్ని చూశారా? వేరే దేశం నుంచి వచ్చాడు. కానీ, ఇక్కడ సంతోషంగా బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు. అందువల్లే ఆటోల్లో అవినీతి పెరిగిపోయింది. ఇప్పుడే ఇతడు ఒక మహిళను తన బైక్‌పై డ్రాప్ చేశాడు.

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

అది కూడా అక్రమంగా బైక్ నడుపుతూ. ఇతడు మన దేశం వాడు కాదు. వేరే దేశానికి చెందిన వాడు’’ అంటూ ఆటో డ్రైవర్ అన్నాడు. అంతే కాదు.. ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను కొట్టబోయాడు. ఇదంతా జరుగుతుంటే ఆ రైడర్ మాత్రం భయంగా చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలకు తావులేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాత్రం వెల్లడించలేదు. కాగా, బెంగళూరు నగరంలో ఇలా బైక్ ట్యాక్సీ రైడర్లపై ఆటో డ్రైవర్లు తరచూ దాడులు చేస్తుంటారని నెటిజన్లు అంటున్నారు.