Operation Ganga: ఆపరేషన్ గంగ వేగవంతం.. భారతీయుల తరలింపునకు మరో పది విమానాలు..

యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు ఆపరేషన్ గంగ మరింత వేగవంతంగా కొనసాగుతోంది.

Operation Ganga: ఆపరేషన్ గంగ వేగవంతం.. భారతీయుల తరలింపునకు మరో పది విమానాలు..

Operation Ganga Modi Government’s Daunting Mission To Evacuate Indian Nationals From War Torn Ukraine

Operation Ganga:  యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు ఆపరేషన్ గంగ మరింత వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే యుక్రెయిన్ నుంచి వందలాది మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకూ యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన రెండు విమానాల్లో మొత్తం 469 మంది స్వదేశానికి చేరుకున్నారు. మొత్తంగా యుక్రెయిన్ నుంచి 1156 మంది భారతీయులను తరలించారు. యుక్రెయిన్ నుంచి ఈ రోజు (ఫిబ్రవరి 28) ఉదయం ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. ఆదివారం యుక్రెయిన్ నుంచి మూడో ఎయిరిండియా విమానం భారత్‌కు చేరుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా మూడు విమానాలు యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చాయి. మూడో విమానంలో 198 మందితో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

మరో 15వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా : 
ఆపరేషన్ గంగలో భాగంగా యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ఈ రోజు నుంచి (సోమవారం, మంగళవారం,బుధవారం) రొమేనియా, హంగేరికి పది భారతీయ విమానాలు వెళ్లనున్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బుడాపెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకోనుంది. అలాగే బుడాపెస్ట్, బుకారెస్ట్‌కు నాలుగు విమానాలు వెళ్లనున్నాయి. భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడంలో ఎయిరిండియా తన సర్వీసులను అందిస్తోంది. ఇప్పటికే ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో విమానాలు ఆపరేషన్ గంగలో పాల్గొని భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్నాయి. యుక్రెయిన్‌లో ఇంకా 15వేల మంది భారతీయులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే మరో 50 విమానాలను పంపితేనే పూర్తి స్థాయిలో యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే.. యుక్రెయిన్ నుంచి సోమవారం (ఫిబ్రవరి 28) ఉదయం ఢిల్లీకి మరో విమానం చేరుకుంది. 249 మందితో రుమేనియా నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఉదయం వచ్చిన ఎయిరిండియా విమానంలో 11 మంది తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు యుక్రెయిన్ నుంచి భారత్‌కు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తంగా 58 మంది తెలుగులు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తమ స్వస్థలాలకు వెళ్లేంతవరకు తెలుగు విద్యార్థులకు ఉండేందుకు ఢిల్లీలోనే బస కూడా ఏర్పాటు చేశారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి చేరిన రెండో విమానంలో 250మంది భారతీయులు ఉన్నారు. వారిలో 11మంది ఏపీ విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు.

Operation Ganga Modi Government’s Daunting Mission To Evacuate Indian Nationals From War Torn Ukraine (1)

Operation Ganga Modi Government’s Daunting Mission To Evacuate Indian Nationals From War Torn Ukraine

అలాగే ముంబై చేరుకున్న విమానంలో 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. యుక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. యుక్రెయిన్ యుద్ధ వాతావరణంతో భయాందోళనకు గురైన భారతీయులు మూడు రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో భారతీయులంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు క్షేమంగా చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. యుక్రేనియన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ప్రత్యేక విమానంలో 20 మంది ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిని ముంబై నుంచి ఇండిగో విమనంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు తరలించారు.

పోలాండ్‌లో భారతీయ విద్యార్థులపై అమానుషం :
యుక్రెయిన్‌ నుంచి బయటపడే క్రమంలో పోలాండ్‌ సరిహద్దుల్లో భారత విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శరణార్దులపై పోలాండ్‌ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గాలిలో కాల్పులు జరుపుతూ బెదిరించారు. పోలాండ్‌ పోలీసుల తీరుపై విద్యార్ధులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చే భారతీయ విద్యార్ధులకు వీసాలు లేకుండానే అనుమతిస్తామని యుక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, సరిహద్దుల్లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుక్రెయిన్‌ నుంచి ఒకేసారి లక్షలాదిమంది పోలాండ్‌ సరిహద్దుకు తరలిరావడంతో ఇబ్బందికరంగా మారిందని విదేశాంగశాఖ అధికారులు చెబుతున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న 908 మంది విద్యార్ధులను ఇప్పటివరకు భారత్‌కు చేర్చినట్టు తెలిపారు. రష్యా – యుక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత 4వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. మరో 15 వేల మంది భారతీయులు యుక్రెయిన్‌ ఉన్నారని తెలిపింది. వారిని కూడా సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగశాఖ వెల్లడించింది.


మరోవైపు.. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు వెళ్లాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని మోదీ ఆదేశించారు. హంగరీ, పోలండ్, రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్ దేశాలకు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. యుక్రెయిన్ పరిణామాలపై ప్రధాని మోదీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Read Also : Telugu Students : యుక్రెయిన్ నుంచి తిరిగివస్తున్న తెలుగు విద్యార్థులు .. ఢిల్లీకి చేరిన ఐదో విమానం..!