Ambulance Driver: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్

నెల జీతాలతో బతికే జీవితాల్లోకి నింగిని తాకే సంతోషాన్నించ్చే ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని అందరికీ ఉన్నా కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది.

Ambulance Driver: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన అంబులెన్స్ డ్రైవర్

Crorepati

Ambulance Driver: నెల జీతాలతో బతికే జీవితాల్లోకి నింగిని తాకే సంతోషాన్నించ్చే ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని అందరికీ ఉన్నా కొందరికి మాత్రమే ఆ ఛాన్స్ దక్కుతుంది. అలాంటిదే పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ బర్ధమాన్ జిల్లాలో ఓ వ్యక్తికి జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్న షేక్ హీరాకు జాక్ పాట్ తగిలింది.

రూ.270తో కొన్న లాటరీ టిక్కెట్ కు రూ.కోటి గెలుచుకున్నాడు. గెలిచిన తర్వాత అతనికి మరో భయం పట్టుకుంది. ఎవరైనా వచ్చి లాటరీ టికెట్ దొంగిలిస్తారేమోనని భయంతో పోలీసులను సేఫ్టీ కావాలని అడిగాడు. అధికారులు ఆ ఏర్పాట్లను కూడా చేశారు. జబ్బు పడి ఉన్న తన తల్లి ట్రీట్మెంట్ కు చాలా డబ్బు కావాల్సి ఉందని.. ముందు ఆ డబ్బుతో ట్రీట్మెంట్ చేయిస్తానని చెబుతున్నాడు.

‘నాకెప్పుడో ఒకప్పుడు టికెట్స్ లో జాక్ పాట్ తగులుతుందని తెలుసు. చివరకు ఎలా అయితే నాకు అదృష్టం కలిసొచ్చింది. తల్లికి ట్రీట్మెంట్ చేయించి.. ఇల్లు కట్టుకుంటా అంతకుమించి ఏమీ అవసరం లేదు’ అని హీరా చెబుతున్నాడు.

………………………… : ప్రొటీన్ పౌడర్ల తయారీ ఇంట్లోనే…ఎలాగంటే?