New Parliament Building: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం షెడ్యూల్ ఇలా.. ఏ సమయానికి ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే..

2020 డిసెంబర్​ 10న పార్లమెంట్‌ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భనవం 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో కలిగి ఉంది.

New Parliament Building: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం షెడ్యూల్ ఇలా.. ఏ సమయానికి ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే..

Parliament New Building

Parliament Building Inagurated: నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు విడతల్లో పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఉదయం 7.30 గంటల నుంచే పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

New Parliament building: మేం జోక్యం చేసుకోలేము.. కొత్త పార్లమెంట్ భవనంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రముఖులకు ఆహ్వానం..

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉభయ సభాపతులతో పాటు మాజీ లోక్‌సభ స్పీకర్లకు, రాజ్య సభా చైర్మన్లకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సినీ తారలు, క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది. కొత్త పార్లమెంట్ భవనం యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందించారు. కేంద్రం యొక్క సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్లాన్‌లలో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఎవరు ఏమంటున్నారంటే?

నూతన పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు..

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంకోసం కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఏర్పాట్లు చేసింది. 2020 డిసెంబర్​ 10న పార్లమెంట్‌ నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన విషయం విధితమే. ఈ నూతన పార్లమెంట్ భనవం 64,500 చదరపు మీటర్ల పరిధిలో, నాలుగు అంతస్తుల్లో కలిగి ఉంది. నూతన పార్లమెంట్‌లో ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంటుంది. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీలకోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.

New Parliament Building: నూతన పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసిన కేంద్రం .. ఓ లుక్కేయండి ..

ప్రారంభోత్సవ కార్యక్రమం షెడ్యూల్ ఇలా..

– ఉదయం 7.30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం.

– తమిళనాడు నుంచి వచ్చిన వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

– ఉదయం 8.30 గంటలకు పార్లమెంట్ ప్రాంగణంలోని గదులు, ఛాంబర్స్‌ను ప్రధాన మంత్రి, ప్రముఖులు సందర్శిస్తారు.

– ఉదయం 9.00 గంటలకు ప్రార్థనా సభ.

– ఉదయం11.30 గంటలకు పార్లమెంట్‌కు చేరుకోనున్న అతిథులు.

– మధ్యాహ్నం 12.00 గంటలకు వేదికపైకి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.

– మధ్యాహ్నం 12.07 గంటలకు జాతీయ గీతం.

– మధ్యాహ్నం 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం.

– మధ్యాహ్నం 12.29కి ఉపరాష్ట్రపతి సందేశం.

– మధ్యాహ్నం 12.33 గంటలకు రాష్ట్రపతి సందేశం.

– 12.38 గంటలకు ప్రతిపక్ష నేతల ప్రసంగం.

– మధ్యాహ్నం 12.43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ప్రసంగం

– మధ్యాహ్నం 1.00 గంటలకు 75 రూపాయల నాణెం స్టాంపును విడుదల చేయనున్న ప్రధాని

– మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.