ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేతలు వీళ్లే

  • Published By: venkaiahnaidu ,Published On : October 12, 2020 / 09:21 PM IST
ఆర్థికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేతలు వీళ్లే

2020 Nobel Prize in Economics కీలకమైన ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికా కైవసం చేసుకుంది. ఆర్ధికశాస్త్రం(Economics )లో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి ఇద్దరు అమెరికన్లు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్ లకు ఈ ఏడాది ఆర్ధికశాస్త్రపు నోబెల్ బహుమతి పురస్కారాన్ని అందిస్తున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. ఇద్దరూ రూపొందించిన ఆక్షన్ థియరీకు ఈ అవార్డు దక్కింది.

స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఇవాళ నోబెల్ క‌మిటీ ఈ అవార్డు విజేత‌ను ప్ర‌క‌టిస్తూ… వేలం వేయ‌డం అనేది ప్ర‌తి చోట ఉంటుంద‌ని, అది మ‌న రోజువారి జీవితాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని వెల్ల‌డించింది. ఆర్థికశాస్త్రంలో పౌల్ మిల్‌గ్రామ్‌, రాబ‌ర్ట్ విల్స‌న్‌ లు కనుగొన్న కొత్త ఆక్షన్ సిద్ధాంతాల వ‌ల్ల అమ్మ‌కందారుల‌కు,కొనుగోలుదారుల‌కు, ప‌న్నుదారుల‌కు లాభం చేకూరినట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. రేష‌న‌ల్ బిడ్డ‌ర్ల గురించి విల్స‌న్‌, బిడ్డింగ్‌లో పాల్గొన్న‌వారిలో ఉండే వ్య‌త్యాసాల గురించి పాల్ మిల్‌గ్రామ్ కొత్త ఫార్మాట్ల‌ను త‌యారు చేశారు. ఆర్థికశాస్త్రంలో ఇదొక వినూత్న ప్రయోగానికి దారి తీస్తుందని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ హన్‌సన్ అన్నారు.


పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్‌.. ఇద్దరూ అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన మిల్గ్రోమ్ 1979లో స్టాన్‌ఫొర్డ్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం.. అదే యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరి.. హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతిగా ఉన్నారు. రాబర్ట్ బీ విల్సన్ 1937లో జెనీవాలో జన్మించి.. 1963లో హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా అందుకున్నారు. మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.



కాగా, గ‌త ఏడాది ఆర్థిక‌శాస్త్రంలో గత ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ,ఆయన భార్య ఈస్త‌ర్ డుఫ్లోకి లభించిన విషయం తెలిసిందే. ఇదివరకు భారత్‌కే చెందిన ఆమర్త్యసేన్‌కు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.