ఏప్రిల్-1నుంచి 45ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే.

ఏప్రిల్-1నుంచి 45ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్

Prakash

People above 45 దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు దాటి వ్యాధులు ఉన్న‌వారికి మాత్ర‌మే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఏప్రిల్-1,2021నుంచి 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ క‌రోనా టీకా ఇవ్వ‌ాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ(మార్చి-23,2021)కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. అర్హులైన వారంద‌రూ టీకా కోసం న‌మోదు చేసుకోవాల‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల‌ని జావదేకర్ సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకొని తీసుకొని కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ పొందాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

మరోవైపు,కోవిషీల్డ్ వ్యాక్సిన్..రెండు డోసుల మధ్య ఉండాల్సిన విరామ సమయాన్ని సోమవారం కేంద్రం సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం..మొదటి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. తాజాగా ఈ సమయాన్ని 4- 8 వారాలకు పెంచుతున్నట్లు సోమవారం కేంద్రం ప్రకటించింది. రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించిన తర్వాత నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, కొవిడ్ టీకాపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సవరణ కొవిషీల్డ్ టీకాకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​కు దీనితో సంబంధం లేదని వివరించింది.