loot liquor from car : జాతీయ రహదారిపై కారు ప్రమాదం…కారులో నుంచి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లను ప్రజలు ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది....

loot liquor from car : జాతీయ రహదారిపై కారు ప్రమాదం…కారులో నుంచి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన జనం

loot liquor from car

loot liquor from car : జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్న మద్యం బాటిళ్లను ప్రజలు ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. మద్యం బాటిళ్లను తీసుకొని జాతీయ రహదారిపై వస్తున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. దారిన వెళ్లే వారు సహాయం చేసేందుకు వచ్చి కారులో మద్యం బాటిళ్లను చూశారు. అంతే తలా ఒకటి రెండు బాటిళ్లు తీసుకొని పారిపోయారు.

Also Read : Sachin,Sara Love story : నాడు సచిన్ పైలట్, సారా అబ్దుల్లాల ప్రేమ పెళ్లి…నేడు విడాకులు

కారులో మద్యం బాటిళ్లు ఉండటంతో కారులోని వ్యక్తులు దాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఇదే అదనుగా తీసుకున్న ప్రజలు గుమిగూడి కారులోని బాటిళ్లను తీసుకొని పరారయ్యారు. మరికొందరు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. అసలే 2016వ సంవత్సరం నుంచి బీహార్ రాష్ట్రంలో సంపూర్ణమద్య నిషేధాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో కారులో దొరికిన బాటిళ్లను తీసుకొని తాగేందుకు ఇళ్లకు పారిపోయారు.

Also Read : Triple Talaq : భార్య కనుబొమలు షేప్ చేయించుకుందని…సౌదీలో ఉన్న భర్త షాక్ ఇచ్చాడు

కారు ప్రమాద సంఘటన గురించి సమాచారం అందుకున్న దోభి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం గుమిగూడారు. పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు మద్యం బాటిళ్లను తీసుకుంటూనే ఉన్నారు.

Also Read : Chandrababu Interim Bail : ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. హారతిచ్చి స్వాగతం పలికిన నారా భువనేశ్వరి.. తిరుపతి పర్యటన రద్దు

కాగా కారులోని మద్యం బాటిళ్లను తీసుకుంటూ వీడియోలో ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, వారిని గుర్తిస్తున్నామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ తెలిపారు. సంపూర్ణ మద్య పాన నిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో మద్యం తాగిన, తరలిస్తున్నా నేరమే. మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన వారి కోసం ఎక్సైజ్ శాఖ గాలింపు చేపట్టింది.