Petrol Prices Hike : త్వరలో మళ్లీ పెట్రో బాదుడు.. లీటర్‌కు రూ.10పైనే పెంచుతారట…!

Petrol Prices Hike : మళ్లీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయట.. త్వరలో పెట్రల్ ధరలను పెంచే అవకాశాలు భారీగా ఉన్నాయట. అదేగానీ పెంచితే.. లీటర్‌కు రూ. 10పైనే పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Petrol Prices Hike : త్వరలో మళ్లీ పెట్రో బాదుడు.. లీటర్‌కు రూ.10పైనే పెంచుతారట…!

Petrol Prices Hike

Petrol Prices Hike : మళ్లీ పెట్రోల్ ధరలు పెరగనున్నాయట.. త్వరలో పెట్రల్ ధరలను పెంచే అవకాశాలు భారీగా ఉన్నాయని అంటున్నారు. అదేగానీ పెంచితే.. లీటర్‌కు రూ. 10పైనే పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటివరకూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులకు గతకొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఇంతలో త్వరలో పెట్రో ధరలను పెంచబోతున్నారనే విషయం తెలిసి సామాన్యుల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నప్పటికీ.. భారతదేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలను భారీగా పెంచేసింది మోదీ సర్కారు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇందన ధరల జోలికి వెళ్లడం లేదు. యూపీతో పాటు ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలను పెంచితే అది ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం దానికి జోలికి పోలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే భారీగా పెట్రోల్ ధరలను పెంచడం ఖాయంగా తెలుస్తోంది. సర్వీస్‌ పెట్రోల్‌ బంకుల్లో.. కన్జ్యూమర్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు (Petrol Prices Hike) లీటర్‌కు రూ. 3 నుంచి రూ. 5 తక్కువగా ఉంటాయి. గత కొన్ని నెలలుగా సర్వీస్‌ బంకుల్లో ధర స్థిరంగా ఉంటోంది. కానీ, కన్జ్యూమర్‌ బంకుల్లో మాత్రం పెట్రో ధరలు పెరిగాయి. భువనగిరి జిల్లాలో సర్వీస్‌ బంకుల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.35కు పెరిగింది. అలాగే డీజిల్‌ ధర రూ. 94.74కు పెరిగింది.

కన్జ్యూమర్‌ బంకుల్లో పెట్రోల్‌ ధర రూ. 112.03కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 101.97కు చేరింది. కన్జ్యూమర్‌ బంకుల్లో పెట్రోల్‌ ధర రూ. 3.68 ఎక్కువగా పెరిగింది. డీజిల్‌ ధర ఏకంగా రూ. 7.23 వరకు పెరిగింది. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎప్పటిలానే పెట్రోబాదుడు షురూ కానుంది. కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రో ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. ముడి చమురు ధరలు, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపించవచ్చుననే అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.

Petrol Prices Hike Petrol, Diesel Prices Likely To Hike Rs.10 Above Coming After Five State Elections (1)

Petrol Prices Hike Petrol, Diesel Prices Likely To Hike Rs.10 Above Coming After Five State Elections

పెట్రోలు, డీజిల్‌ ధర లీటరుపై కనీసం రూ.10వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పెట్రోలు ధర లీటరు రూ.117, డీజిల్‌ రూ.107వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా పెట్రోల్ ధరలు పెరిగినా పెరగవచ్చునని చెబుతున్నారు. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు తక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ సేవా కేంద్రా (Kishan Seva Centers)ల పేరిట కన్జ్యూమర్‌ బంకులను ఏర్పాటు చేసింది. రైతులే ఈ PACS బంకుల్లో భాగస్వాములుగా ఉంటారు. పలు సంస్థలు ఈ బంకులను నిర్వహిస్తున్నాయి.

తెలంగాణలో 100కు పైగా ఈ పెట్రోల్ బంకులు ఉన్నాయని అంచనా. కన్య్జూమర్ బ్యాంకుల్లో పెట్రోల్ ధరలను అమాంతం పెంచేయడంతో రైతులంతా తమ అవసరాలకు పెట్రోల్ కోసం ఇతర సర్వీసు బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈ బంకుల నిర్వహణ కష్టంగా మారింది. ఈ క్రమంలోనే చాలా కన్జ్యూమర్‌ బంకులు మూతపడ్డాయి. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెట్రల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 నుంచి రూ.110వరకు పెరిగింది. అలాగే డీజిల్‌ ధర రూ.90 నుంచి రూ.100 మధ్య స్థిరంగా ఉంటూ వచ్చింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు కంటే ఎక్కువగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో కూడా తేలింది. అందులో 42 శాతం మంది పెట్రోల్ ధరల పెంపును భరించలేమని అన్నారు.

Read Also : Sri Lanka : రష్యా – యుక్రెయిన్ యుద్ధం, లీటర్ పెట్రోల్ రూ. 204!