ఒబెసిటీ ఉన్న వాళ్లకు ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయదు!!

ఒబెసిటీ ఉన్న వాళ్లకు ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయదు!!

Vaccine for Obesity People: ఒబెసిటీతో బాధపడేవాళ్లలో ఫైజర్ వ్యాక్సిన్ అంత ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు. ఇటాలియన్ రీసెర్చర్స్ నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత ఒబెసిటీ ఉన్న హెల్త్ కేర్ వర్కర్లలో యాంటీబాడీలు పెరగలేదని గుర్తించారు. ఆరోగ్యంగా ఉండేవారితో పోలిస్తే.. ఒబెసిటీతో ఉండేవారిలో సగం మాత్రమే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిసింది.

ఈ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ కరోనావైరస్ నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఒబెసిటీ ఎక్కువగా ఉండటం అంటే బాడీ మాస్ ఇండెక్స్ 30కు మించి ఉండటం. అలా ఉండేవారిలో కొవిడ్ 19రిస్క్ ఎక్కువగా ఉండి సగం మంది ప్రాణాలు కోల్పోయిన వారే ఉన్నారట. హాస్పిటల్ కు వెళ్లి ఈ రిస్క్ తగ్గించుకున్న వాళ్లూ ఉన్నారు.

ఇతర మెడికల్ కండిషన్స్ కారణంగా.. అంటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ లు ఉన్న వారికి కరోనావైరస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు శరీరంలో అధికంగా కొవ్వు చేరినా సమస్యలు తప్పవు. మెటబాలిక్ మార్పులు వచ్చి, ఇన్సులిన్ ను తగ్గిస్తుంది లేదా పెంచుతుంది. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది.

ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న 248హెల్త్ కేర్ వర్కర్లలో యాంటీబాడీ రెస్పాన్స్ 99.5 శాతం మందిలో పాజిటివ్‌గా ఉంది. కొవిడ్ 19 నుంచి రికవరీ అయిన వారికంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు అధిక బరువు, ఒబెసిటీ పేషెంట్లలో మరింత అల్పంగా కనిపించాయి యాంటీబాడీల ఉత్పత్తి.