యుద్ధం వస్తే 10 రోజుల్లో ఓడిస్తాం : పాకిస్తాన్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 11:05 AM IST
యుద్ధం వస్తే 10 రోజుల్లో ఓడిస్తాం : పాకిస్తాన్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే… పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని

దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే… పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని మోడీ చెప్పారు. 70 ఏళ్లలో భారత్ చేతిలో మూడు సార్లు ఓడినా.. పాక్ కు ఇంకా బుద్ధి రాలేదని మోడీ మండిపడ్డారు. భారత్ తో నేరుగా యుద్ధం చేసే ధైర్యం పాకిస్తాన్ కు లేదన్నారు మోడీ. అందుకే పరోక్ష యుద్ధం చేస్తోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మోడీ చెప్పారు. ఢిల్లీలో National Cadet Corps Rally లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఇందులో పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు.

 

10 రోజుల్లో పాక్ ను చిత్తు చేస్తాం:
పాకిస్తాన్ చేస్తున్న పరోక్ష యుద్ధం కారణంగా మన దేశంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు వదిలారని ప్రధాని మోడీ వాపోయారు. ” భారత్ చేతిలో పాక్ మూడు సార్లు ఓడిపోయిందని అందరికి తెలుసు. పాకిస్తాన్ ను ఓడించడానికి మన బలగాలకు 10-12 రోజులు కన్నా ఎక్కువ సమయం అవసరం లేదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ మన పై పరోక్ష యుద్ధం చేస్తోంది. అనేక మంది పౌరులు, జవాన్లను బలి తీసుకుంది” అని మోడీ అన్నారు.

 

సర్జికల్ స్ట్రయిక్స్ తో గుణపాఠం చెప్పాం:
ఇండియా ఐడియాలజీ మారిందని ప్రధాని మోడీ అన్నారు. మన దేశం కొత్త ఐడియాలజీని ఆపాదించుకుందన్నారు. అదే యంగ్ అండ్ డిసిప్ లైన్డ్ అని చెప్పారు. అందుకే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ సర్జికల్ స్ట్రయిక్స్, ఎయిర్ స్ట్రయిక్స్ చేశామని, పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పామని ప్రధాని మోడీ వెల్లడించారు. ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.

ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం:
2016లో భారత ఆర్మీ… పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి Surgical Strikes చేసింది. ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. Uri ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఈ సర్జికల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 19మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని భారత ఆర్మీ ప్రకటించింది. ఇక 2019లో ఫిబ్రవరి 26న పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద క్యాంపులపై భారత వాయుసేన Air Strikes  చేసింది. జైషే మహమ్మద్ కు చెందిన అతిపెద్ద టెర్రర్ క్యాంప్ బాలాకోట్ లోని Khyber Pakhtunkhwa Provicnceలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాద శిబిరాలను నేల మట్టం చేసింది.

Also Read : #Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!

 

Also Read : బ్రేకింగ్ : Man vs Wild షూటింగ్ లో రజనీకాంత్ కు గాయాలు