G20 Summits: నేడు ఇండోనేషియా పర్యటనకు ప్రధాని మోదీ .. బిడెన్, సునక్ సహా 10మంది అగ్ర నేతలతో భేటీ..

బాలిలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో మూడు కీలక సెషన్లలో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ప్రధాని మోదీ ఇతర నేతలు చర్చిస్తారని చెప్పారు.

G20 Summits: నేడు ఇండోనేషియా పర్యటనకు ప్రధాని మోదీ .. బిడెన్, సునక్ సహా 10మంది అగ్ర నేతలతో భేటీ..

PM MODI

G20 Summits: ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ మేరకు నేడు మూడు రోజుల పర్యటనకోసం మోదీ బాలి వెళ్లనున్నారు. G-20 శిఖరాగ్ర సమావేశంలో ఆరోగ్యం, పోస్ట్-పాండమిక్ రికవరీ, ఇంధనం, ఆహార భద్రత రంగాలలో కీలకమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వివరిస్తారు. అదేవిధంగా ఉక్రెయిన్ వివాదం, దాని పర్యవసానాలతో సహా ప్రపంచ సవాళ్లపై జరిగే విస్తృత చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.

Urfi Javed : అలాంటి బట్టలు వేసుకుంటే చంపేస్తాం.. ఉర్ఫీకి బెదిరింపులు.. ఫైర్ అయిన ఉర్ఫీ జావేద్..

నవంబర్ 15, 16 తేదీలలో బాలిలో జరగనున్న ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సమావేశం భారతదేశానికి చాలా ముఖ్యమైనది. గ్లోబల్ ఎకానమీ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ప్రధాని మోదీ నరేంద్ర మోదీ ఇతర దేశాల అధినేతలతో చర్చిస్తారు. సుమారు 45గంటల పాటు సాగే ప్రధాని పర్యటనలో 20 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో పాటు 10మంది దేశాధినేత్రలతో ప్రధాని భేటీ కానున్నారు.

Suicide Bombing At Istanbul: ఇస్తాంబుల్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. ఆరుగురు మృతి.. 80 మందికిపైగా గాయాలు

బాలిలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో మూడు కీలక సెషన్లలో ప్రధాని మోదీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి అంశాలపై ప్రధాని మోదీ ఇతర నేతలు చర్చిస్తారని చెప్పారు. G20 నాయకులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చిస్తారు. వాటిని పరిష్కరించడంలో సహాయం చేయడానికి బహుపాక్షిక సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారని క్వాత్రా చెప్పారు. సెప్టెంబర్ 2023లో తదుపరి G20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న విషయం విధితమే. ఇదిలా ఉంటే G20 సభ్యులుగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ రాష్ట్రాలు మరియు యూరోపియన్ యూనియన్