PM Vishwakarma scheme: మోదీ పుట్టిన రోజు సందర్భంగా ‘పీఎం విశ్వకర్మ’ పథకం ప్రారంభం.. ఎవరు అర్హులు? ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
పీఎం విశ్వకర్మ పథకం ద్వారా హస్త కళాకారులు సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. రెండు లక్షల రుణం పొందొచ్చు. తొలి విడతగా రూ.లక్ష, రెండో విడతలో రూ.2లక్షలు రుణం అందిస్తారు.

PM modi
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు కానుకగా హస్తకళాకారులకు, చేతివృత్తుల వారికి కొత్త పథకాన్ని ప్రారంభించారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఐదేళ్ల కాలంకు రూ.13వేల కోట్లు నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్ లతో సహా సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు చెందిన 30లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.
పీఎం విశ్వకర్మ పథకం ద్వారా హస్త కళాకారులు సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. రెండు లక్షల రుణం పొందొచ్చు. తొలి విడతగా రూ.లక్ష, రెండో విడతలో రూ.2లక్షలు రుణం అందిస్తారు. రుణాల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సబ్సిడీ వడ్డీ రేటుతో లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు 5శాతంగానే ఉంటుంది. ఈ పథకం ద్వారా విశ్వకర్మగా గుర్తింపు పొందేందుకు సర్టిఫికేట్, ఐడీ కార్డు పొందుతారు. హస్త కళాకారులు వారి నైపుణ్యాలను పెంచుకోవడం కోసం స్కిల్ అప్ గ్రేడేషన్ ఫెసిలిటీ లభిస్తుంది. ఇంకా టూల్ కిట్ ఇన్సెంటివ్ పొందొచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. మార్కెటింగ్ మద్దతు కోసం ప్రోత్సాహకం అందించడం వంటివి కూడా పొందొచ్చు.
ఈ పథకంలో రెండు రకాల స్కిల్లింగ్ కార్యక్రమాలు ఉంటాయి. బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి. వీటిల్లో శిక్షణ పొందుతున్నప్పుడు లబ్ధిదారులకు రోజుకు రూ.500 స్టైఫండ్ కూడా అందిస్తారు. ఇంకా మోడ్రన్ టూల్స్ కొనుగోలు చేయడానికి వారికి రూ. 15వేల వరకుమద్దతు కూడా లభిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15రోజులు అధునాతన శిక్షణ కోసం నమోదు చేసుకోవచ్చు.