Karnataka: 19 ర్యాలీలు, 6 రోడ్ షోలు.. అయినా బీజేపీ ఓటమి.. మోదీ ఇమేజ్ తగ్గిందా? ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో..

Karnataka: ఇదే నిజమైతే ఇక రా.గా (రాహుల్ గాంధీ) తిరుగులేని నేతగా అవతరించే అవకాశం ఉందా?

Karnataka: 19 ర్యాలీలు, 6 రోడ్ షోలు.. అయినా బీజేపీ ఓటమి.. మోదీ ఇమేజ్ తగ్గిందా? ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో..

Rahul gandhi, Modi

PM Modi: “ప్రచార భారాన్ని భుజాన వేసుకున్న ప్రధాని మోదీ.. అంతాతానై ప్రచారం చేస్తోన్న ప్రధాని.. న.మోపై పూలవర్షం కురిపించిన ప్రజలు.. మరో తలపాగాతో కనపడిన ప్రధాని”… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే (Karnataka campaign) కాదు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ (Modi) గురించి వినిపించిన వ్యాఖ్యలు ఇవి.

అందుకు తగ్గట్లుగానే మోదీ ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు.. యావత్ దక్షిణ భారతం నుంచి బీజేపీకి లోక్ సభ నియోజక వర్గాల్లో ఓట్లు రావాలంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఊహించని విధంగా అపజయాన్ని మూటగట్టుకుంది.

మోదీ ఎంతగా కష్టపడ్డారంటే?
మోదీ కర్ణాటక ఎన్నికల వేళ 19 ర్యాలీలు, 6 రోడ్ షోల్లో పాల్గొన్నారు. అయినా బీజేపీకి ఓటమి తప్పలేదు. దీంతో మోదీ ఇమేజ్ తగ్గిందా? ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటీ? అన్న వాదనలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ ఇవాళ సాధించింది మామూలు విజయం కాదు. ఎవరూ ఊహించని రీతిలో 136 సీట్లు గెలుచుకుంది.

బీజేపీ ఇవాళ కర్ణాటకలో మూటగట్టుకుంది మామూలు ఓటమి కాదు.. అతి కష్టం మీద కేవలం 65 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోదీ మాత్రమే కాదు.. చాలా మంది కేంద్ర మంత్రులు కూడా ఆ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. నిజానికి ఇటీవల ఏ రాష్ట్రంలోనూ కష్టపడనంతగా ఇప్పుడు కష్టపడ్డారు మోదీ.

ర్యాలీలు, రోడ్ షోలతో తీరిక లేకుండా గడిపారు. ఒక్క బెంగళూరులోనే 26 కిలోమీటర్ల మేర పర్యటించారు. ఎంతగా శ్రమించినా కర్ణాటకలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన మరిపించలేకపోయారు. మోదీ మ్యాజిక్ ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. బీజేపీ మొత్తం కలిపి 3,116 ఎన్నికల సభలు నిర్వహించింది.

వచ్చే ఎన్నికల్లో ప్రభావం

మోదీ మెయిన్ క్యాంపయినర్ గా ఉన్నప్పటికీ 128 జాతీయ బీజేపీ నేతలు కర్ణాటకలో పర్యటించారు. 15 మంది కేంద్ర మంత్రులూ అదే పని చేశారు. అమిత్ షా 16 ర్యాలీలు, 15 రోడ్ షోల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా 10 ర్యాలీలు, 16 రోడ్ షోల్లో పాల్గొని ప్రచారం చేశారు. ఇంతగా కష్టపడ్డప్పటికీ న.మోగాలి సౌతిండియాలో వీయలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ ప్రభావం పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఇక రా.గా (రాహుల్ గాంధీ) తిరుగులేని నేతగా అవతరించే అవకాశం ఉంది.

Narendra Modi : కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే