#9YearsOfModi Govt : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు .. మరెన్నో సంచలన నిర్ణయాలు

నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్‌ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు.. ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంచలనాలకు తెరతీసింది.

#9YearsOfModi Govt : మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో మైలురాళ్లు .. మరెన్నో సంచలన నిర్ణయాలు

9YearsOfModi Govt

#9YearsOfModi Govt : 9YearsOfModi Govt : ప్రధాని మోదీ పాలనకు తొమ్మిదేళ్లు పూర్తయింది. 10ఏళ్ల కాంగ్రెస్‌ పాలనకు ముగింపు పలుకుతూ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ఈ తొమ్మిదేళ్లలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి నవశకానికి నాందిపలికారు. దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిర, మన్మోహన్‌ తర్వాత అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానిగా.. తొమ్మిదేళ్లు పాలించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ అరుదైన రికార్డు నెలకొల్పారు. మోదీ నాయకత్వంలో ఈ తొమ్మిదేళ్లలో దేశం ఎన్నో మైలురాళ్లు దాటింది. కొన్ని విమర్శలు ఉన్నా.. సంచలన మార్పులకు.. పరిపాలన సంస్కరణలకు పెద్దపీట వేసిన మోదీ సర్కారు.. అద్భుత విదేశాంగ, రక్షణ, ఆర్థిక విధానాలతో ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక స్థానం దక్కేలా చేసింది.

నోట్ల రద్దు.. సువిశాల రోడ్లు, వందే భారత్‌ రైళ్లు, పేదలకు ఇళ్లు, రైతులకు భరోసా, విద్య, వైద్యం, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు.. ఏమిటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఇవి ప్రధాని మోదీ పాలనకు గీటురాళ్లు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడుతూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంచలనాలకు తెరతీసింది. జనధన్‌ బ్యాంకు ఖాతాలు, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను విధానాలతో దేశంలో తన మార్కు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ప్రధాని మోదీ. నోట్ల రద్దుపై ఎన్ని విమర్శలు వచ్చినా.. బీరువాల్లోనూ.. నేలమాలిగల్లోనూ ముక్కిపోయిన డబ్బును చలామణిలోకి తెచ్చి ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చేశారు ప్రధాని మోదీ.

 

నోట్ల రద్దు ఫలితంగా వృద్ధి రేటు తాత్కాలికంగా తగ్గినట్లు కనిపించినా.. ఆ ప్రభావం దీర్ఘకాలంలో సానుకూల ఫలితాలనే ఇస్తున్నట్లు చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. గత మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో కోటి 87 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూలైంది. ఇది అత్యధిక పన్ను వసూళ్లు, స్థిరమైన వృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. 2017లో విమర్శలు, ప్రతిఘటనలు లెక్కచేయకుండా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ పన్ను విధానం వల్ల దేశంలో ప్రతిలావాదేవీ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. అంతేకాదు కోవిడ్‌ మహమ్మారి ఆర్థిక రంగానికి ప్రతిబంధకాలు సృష్టించినా.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిన.. మన దేశంలో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

ప్రపంచ సంక్షోభంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. 50 శాతం ఎగుమతులు పెరిగి మన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశాయి. స్టార్టప్‌లు, యూనికాన్‌ పరిశ్రమలతో ప్రగతి పథాన పయనిస్తున్న మన దేశం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన మనదేశం బ్రిటన్‌ను వెనక్కి నెట్టింది. మేకిన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ నినాదాలతో మోదీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మన దేశం చైనాను కూడా వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. జనాభా పెరుగుదలను కూడా చక్కని అవకాశంగా మలుచుకుంది కేంద్ర ప్రభుత్వం. సేవ, సుశాసన్‌, గరీబ్‌ కల్యాణ్‌ ప్రాతిపదికన సంక్షేమ కార్యక్రమలు అమలు చేసి పేదలకు అండగా నిలిచింది.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అందులో ప్రధానమైనది డిజిటలైజేషన్‌. డిజిటల్‌, యూపీఐ చెల్లింపులు ఈ తొమ్మిదేళ్లలో గణనీయంగా పెరిగాయి. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 48 కోట్లకు పైగా జనధన్‌ బ్యాంకు అకౌంట్లు తెరిచారు. ప్రతిఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండటంతో ప్రభుత్వ పథకాల చెల్లింపుల్లో పారదర్శకత పెరిగింది. అవినీతి బాగా తగ్గింది. 2016లో పెద్ద నోట్ల రద్దు చేయడం ప్రధాని మోదీ పాలనలో సాహసోపేత నిర్ణయంగా చెప్పొచ్చు. నల్లధనం వెలికి తీయాలనే లక్ష్యంతో మోదీ తీసుకున్న నిర్ణయంతో ఎక్కడెక్కడో దాచిన డబ్బంతా జన జీవితం మధ్యకు వచ్చింది.

ఇలా సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ అదే సమయంలో దేశ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐడియా నుండి ఇన్నోవేషన్ వరకు దేశాన్ని స్టార్టప్‌ ల్యాండ్‌స్కేప్‌గా మార్చేశారు. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా పాలసీతో మోదీ ప్రభుత్వ హయాంలో స్టార్టప్‌లు వేగంగా అభివృద్ధి చెందాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉన్న దేశంగా అవతరించిన మన దేశంలో ఈ తొమ్మిదేళ్లలో 225 శాతం మేర స్టార్టప్‌లు పెరిగాయి. 442 స్టార్టప్‌లు నుంచి 99 వేల 371 స్టార్టప్‌ పరిశ్రమలు ఏర్పాటు కావడం మోదీ ప్రభుత్వ విధానాల ఫలితమేనని చెప్పొచ్చు. ఇదే సమయంలో 100 కంటే ఎక్కువ యునికార్న్‌లు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో 8.93 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి.

అన్నిటికి మించి జాతీయ రహదారుల నిర్మాణంలోనూ మోదీ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణ పనుల్లోనూ అంతేవేగం చూపించింది. 2014 నుంచి రోడ్డు రవాణా, జాతీయ హైవేల నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయింపులను 500 శాతం పెంచింది మోదీ ప్రభుత్వం. గ్రామీణ రహదారుల కనెక్టివిటీని 99 శాతానికి పెంచింది. అంతేకాదు రెండు అతిపెద్ద జాతీయ రహదారి కారిడార్‌ ప్రాజెక్టులు చేపట్టిన మోదీ ప్రభుత్వం.. ఇందు కోసం 99 వేల 872 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్‌ నుంచి బీహార్‌, మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌ వరకు రెండు జాతీయ రహదారులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. దాదాపు మూడు వేల కిలోమీటర్లు ఉన్న ఈ రెండు రోడ్లు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక మొదలై పూర్తికావడం విశేషంగా చెప్పొచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధాని మోదీ ఘన విజయాలెన్నో.. మౌలిక రంగాలకు సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక రంగ అభివృద్ధికి ఊతమివ్వొచ్చొని ప్రధాని మోది నమ్మిన సిద్దాంతం వందశాతం నిజమైంది. ఇక విద్య, వైద్య రంగాల్లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది మోదీ సర్కార్‌. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.