ప్రధాని మోడీతో అఖిల పక్ష సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Published By: Subhan ,Published On : June 19, 2020 / 12:24 PM IST
ప్రధాని మోడీతో అఖిల పక్ష సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు

పలు రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరుగుతున్న సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే గాల్వాన్‌ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణ ప్రస్తావన తెచ్చారు. గతంలో జరిగిన పరిణామాలు, తర్వాత తీసుకోనున్న చర్యలను చర్చించారు. 

ఆ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ప్రధాని పలు పార్టీల నేతలతో పాటు నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం వహించారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి కూడా పాల్గొన్న సమావేశంలో తెలుగు సీఎంలతో పాటుగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే, జేపీ నద్దా, నితిష్ కుమార్, స్టాలిన్, సుఖ్బిర్ సింగ్ బాదల్, డి.రాజా,  ప్రేమ్ సింగ్ తమాంగ్ తదితరులు పాల్గొన్నారు. 
 
గాల్వాన్ లోయ ఘటన గురించి పూర్తి వివరణ ఇవ్వనున్నారు. కేంద్రం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది వివరించనున్నారు. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు లాలూకు, టీడీపీకి కూడా ఆహ్వానం అందలేదు. 

Read: మావోయిస్టులకు కరోనా సెగ