Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

గురువారం పార్లమెంట్‭లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్‭దీప్ ధన్‭కడ్‭, లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్‭లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్‭డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం సైతం కొవిడ్ గురించి వరుస ప్రకటనలు చేయడం, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడం వంటివి ఇలాంటి వాటికి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి

Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Possibility of lockdown? IMA doctor says THIS

Covid19: దేశంలో మళ్లీ కొవిడ్ కలకలం మొదలైంది. గురువారం పార్లమెంట్‭లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్‭దీప్ ధన్‭కడ్‭, లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా ఒక్కసారిగా మాస్క్‭లు పెట్టుకుని కనిపించారు. దీంతో దేశంలో మరోసారి లాక్‭డౌన్ పెట్టనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం సైతం కొవిడ్ గురించి వరుస ప్రకటనలు చేయడం, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడం వంటివి ఇలాంటి వాటికి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి. అయితే దేశంలో అలాంటి అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తేల్చి చెప్పింది. దేశంలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్ అయిందని, లాక్‭డౌన్ అవసరం మన దేశానికి ఉండదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అనిల్ గోయెల్ అన్నారు.

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

దేశ ప్రజల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉందని, దీనికి తోడు దాదాపుగా వ్యాక్సినేషన్ జరిగిందని అన్నారు. అయితే లాక్‭డౌన్ అవసరం లేదని చెప్పిన ఆయన ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ విధానానికి మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ప్రజలు కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గోయెల్ సూచించారు. ప్రభుత్వం తెలిపే నిబంధనలను పాటించి, ఏమాత్రం ముప్పు లేకుండా చూడాలని అన్నారు. మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గోయెల్ సూచించారు.

Rajya Sabha: బుధవారం అవమానం, గురువారం వెనక్కి.. బిహార్‭పై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్