Nashik Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

మహారాష్ట్ర నాసిక్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 24 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించింది.

Nashik Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం

Nashik Bus Accident

Nashik Bus Accident: మహారాష్ట్ర నాసిక్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 24 మంది గాయపడ్డారు. నాసిక్‌లోని ఔరంగాబాద్ రోడ్డులో ఓ స్లీపర్ బస్సు డీజిల్ ట్రక్కును ఢీకొట్టడంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 10 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 24 మందికి గాయాలయ్యాయి.

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

బస్సు ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బస్సు దగ్దమవుతోన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే బస్సు ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ప్రదాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు షిండే ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.