Resort Murder Case: పులకిత్ ఆర్యకు ఆ ఒక్కటి తప్పితే ఇంకేదీ తెలియదు.. తండ్రి వినోద్ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. నిందితులు ఎలాంటి వారైనా వదిలేదని లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రిసార్టును బుల్డోజర్లతో కూల్చివేశారు. కొంత మంది స్థానికులు అప్పటికే దానికి నిప్పు పెట్టారు.

Resort Murder Case: పులకిత్ ఆర్యకు ఆ ఒక్కటి తప్పితే ఇంకేదీ తెలియదు.. తండ్రి వినోద్ ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు

Pulkit arya is innocent says father vinod arya who is expelled from bjp

Resort Murder Case: ఉత్తరాఖండ్ రిసార్ట్‭ మర్డర్ కేసులో ప్రధాని నిందితుడైన పులకిత్ ఆర్య అమాయకుడని, నిజానికి అతడిది అలాంటి వ్యక్తిత్వం కాదని.. కొడుకును వెనకేసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ నేత (బహిష్కరించారు) వినోద్ ఆర్య. ఈ విషయమై ఇప్పటికే పులకిత్ ఆర్య అరెస్ట్ కాగా, వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించారు. ప్రస్తతం ఈ వివాదం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపివేస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకు గురించి ప్రశ్నించగా.. అతడు నిర్ధోషని, అమాయకుడని తండ్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

‘‘అలాంటి కార్యకలాపాల్లో పులకిత్ అస్సలు తలదూర్చడు. అతడికి అలాంటివి తెలియవు కూడా. అమాయకుడు అతడు. అందరిలాంటి సాదా సీదా కుర్రాడు. తన పని తప్పితే వేరే ప్రపంచం తెలియదు. నా కొడుకు పులకిత్ ఆర్యతో పాటు అంకిత భండారి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ కేసుపై విచారణ నిష్పాక్షికంగా, న్యాయంగా జరగాలనే బీజేపీకి రాజీనామా చేశాను. నా కొడుకు అంకిత్ కూడా అందుకే రాజీనామా చేశాడు’’ అని ఆదివారం వినోద్ ఆర్య అన్నారు.

Inside Kuno Park: చీతాలు ఇప్పుడెలా ఉన్నాయి.. ఏం తింటున్నాయి.. అడవిలో ఎప్పుడు వదిలిపెడతారో తెలుసా!

ఇక ఈ కేసులో శనివారం ఓ కీలక విషయం బయటికి వచ్చింది. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయడానికి ఒప్పుకోనందుకే అంకితను హత్య చేసినట్లు వెల్లడైంది. తన స్నేహితులతో అంకిత జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని ఆమెపై యజమాని ఒత్తిడి తీసుకువచ్చాడట. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

హత్యకు ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. అనంతరం అంకితకు రాత్రి 8:30 గంటలకు ఫోన్ చేయగా.. కలవేలదని, దీంతో పులకిత్ ఆర్య‭కు ఫోన్ చేస్తే నిద్రపోవడానికి తన గదికి వెళ్లిందని చెప్పాడట. తర్వాతి రోజు అతడికి మళ్లీ ఫోన్ చేసి అంకిత గురించి అడుగుదామని ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చిందట. వెంటనే అతడి సోదరుడు అంకిత్ ఆర్యకు ఫోన్ చేస్తే అంకిత జిమ్‭లో ఉందని బదులిచ్చాడట. అయితే రిసార్ట్ చెఫ్ మాత్రం ముందు రోజు నుంచే అంకిత కనిపించడం లేదని చెప్పినట్లు అంకిత స్నేహితుడు తెలిపాడు.

ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. నిందితులు ఎలాంటి వారైనా వదిలేదని లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రిసార్టును బుల్డోజర్లతో కూల్చివేశారు. కొంత మంది స్థానికులు అప్పటికే దానికి నిప్పు పెట్టారు.

Hijab Row: ఇంటర్నెట్‭ను మరింత సులభతరం చేసిన అమెరికా.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం