Punjab: గన్ కల్చర్‭పై భగ్గుమన్న మాన్ ప్రభుత్వం.. 813 గన్ లైలెన్స్‭లు రద్దు

కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అమృతపాల్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ చర్యతో ప్రభుత్వం అతడికి లొంగిపోయిందనే విమర్శలు వచ్చాయి. గతేడాది మేలో మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పంజాబ్‌లో తుపాకీ సంస్కృతి పెరిగింది.

Punjab: గన్ కల్చర్‭పై భగ్గుమన్న మాన్ ప్రభుత్వం.. 813 గన్ లైలెన్స్‭లు రద్దు

Punjab continues as state cancels 813 arms licences

Punjab: పంజాబ్ రాష్ట్రంలో తుపాకి సంస్కృతి పెరిగిపోయింది. ప్రత్యర్థులు, గ్యాంగ్ వార్లు అంటూ కాల్పులు జరుగుతుండడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఫేమస్ సింగర్ సిద్దూ మూసేవాలా ఇలాగే మరణించారు. అనంతరం కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూడడంతో దీనిపై భగవంత్ మాన్ ప్రభుత్వం చర్యలకు దిగింది. తాజాగా 813 మంది ఆయుధాల లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది. లూథియానా రూరల్‌ నుంచి 87, షాహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ నుంచి 48, గురుదాస్‌పూర్‌ నుంచి 10, ఫరీద్‌కోట్‌ నుంచి 84, పఠాన్‌కోట్‌ నుంచి 199, హోషియాపూర్‌ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్‌ఏఎస్‌ కస్బా నుంచి 235, సంగర్‌ నుంచి 16 లైసెన్స్‌లు రద్దు చేసినట్లు ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Bangalore Auto Driver: హిందీ-కన్నడ గొడవ.. ‘నార్త్ ఇండియన్ బిచ్చగాళ్లు’ అంటూ తిట్టిన ఆటో డ్రైవర్

అమృత్‌సర్ కమిషనరేట్‌లో 27 మంది, జలంధర్ కమిషనరేట్‌తో పాటు అనేక జిల్లాలకు చెందిన 11 మంది లైసెన్స్‌లు కూడా రద్దు చేశారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది. తుపాకులు ఉంచడానికి కొన్ని నియమాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాలలో ఆయుధాలను తీసుకెళ్లడం, ప్రదర్శించడంపై ఇప్పుడు నిషేధం ఉన్న విషయాన్ని నొక్కి చెప్పింది. రాబోయే రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో అకస్మాత్తు తనిఖీలు నిర్వహిస్తారని, హింసకు కారణమయ్యే ఆయుధాలపై పూర్తి నిషేధం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

Separate Muslim Nation: ప్రత్యేక ముస్లిం దేశం డిమాండ్ చేస్తామంటూ మౌలానా తౌకీర్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో జరిగిన హత్యల అనంతరం క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని, తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం పేర్కొంది. అమృత్‌పాల్ సింగ్ సహచరుల్లో తొమ్మిది మంది ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేయాలని అమృత్‌సర్ జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. లైసెన్సులు ఆత్మరక్షణ కోసం ఇవ్వబడ్డాయే కానీ, ఖలిస్తానీ నాయకుడికి భద్రత కల్పించడం కోసం కాదని ప్రభుత్వం పేర్కొంది.

NTK leader Seeman: చల్లారుతున్న మంటపై పెట్రోల్ పోసిన ఎన్టీకే నేత.. హిందీ మాట్లాడే వారిని తమిళనాడు నుంచి వెల్లగొడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అమృతపాల్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ చర్యతో ప్రభుత్వం అతడికి లొంగిపోయిందనే విమర్శలు వచ్చాయి. గతేడాది మేలో మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య అనంతరం పంజాబ్‌లో తుపాకీ సంస్కృతి పెరిగింది. ఇది తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రోత్సహించింది. అలాగే గ్యాంగ్‌స్టర్‌లకు ఊతం దొరికినట్టైంది.