Video: ఇప్పటికే ఏం చేయాలో తెలియక ఇండిగో అధికారులు తలలు పట్టుకుంటుంటే.. విమానంలోకి పావురం దూరి రచ్చ రచ్చ చేసి..
“ఇండిగో కష్టకాలంలో ఉంటే.. ఈ పావురం ఇప్పుడు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది” అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
Video: బెంగళూరు-వడోదర ఇండిగో ఫ్లైట్‌లో పావురం ప్రవేశించి గందరగోళం సృష్టించింది. ఇప్పటికే వందలాది విమానాల రద్దులు, ఆలస్యాలతో ఇండిగో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఆ సమస్యలు చాలవన్నట్లు.. ఓ ఇండిగో విమాన టేకాఫ్‌కు ముందు అందులో పావురం కనపడింది.
విమానంలో ఎగురుతూ ఎవరి చేతికీ చిక్కకుండా రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ ఘటన బెంగళూరు నుంచి వడోదరకు బయలుదేరాల్సిన ఇండిగో ఫ్లైట్‌లో జరిగింది.
పావురం కేబిన్‌లో పాసింజర్ల తలలపై ఎగురుతూ బయటికి దారి వెతుక్కుంటూ కనిపించింది. క్రూ మెంబర్లు, కొంతమంది పాసింజర్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా, అది ఐల్‌లో తిరుగుతూ కొద్దిసేపు గందరగోళం సృష్టించింది.
ఈ వీడియోను ఓ ప్యాసింజర్ రికార్డ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. “ఫ్లయిట్‌లో సర్ప్రైజ్ గెస్ట్” అని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు ఆ ఎయిర్‌లైన్ ఇబ్బందులపై సెటైర్లు వేశారు. “ఇండిగో కష్టకాలంలో ఉంటే ఈ పావురం ఇప్పుడు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది” అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
