Rahul Gandhi: పీఎఫ్ ఖాతా సొమ్ముపై వడ్డీ రేటు తగ్గించిన కేంద్రం: ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు

ఉద్యోగుల భవిష్య నిధి (Employee Provident Fund) పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: పీఎఫ్ ఖాతా సొమ్ముపై వడ్డీ రేటు తగ్గించిన కేంద్రం: ప్రధాని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు

Epf

Rahul Gandhi: ఉద్యోగుల భవిష్య నిధి (Employee Provident Fund) పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ..ప్రధాని మోదీ, బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ శాతాన్ని 8.1%కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈమేరకు EPF కార్యాలయం ఈ ఏడాది మార్చిలో ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల భవిష్యత్ అవసరాల దృష్ట్యా భవిష్య నిధి సేకరణ తప్పని చేసింది భారత ప్రభుత్వం. ఈక్రమంలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.

“’లోక్ కళ్యాణ్ మార్గ్'(ఢిల్లీలో ప్రధాని నివాసం) ఇంటి చిరునామా ఉన్నంత మాత్రానా ప్రజలకు సంక్షేమం అందించడం లేదు. 6.5 కోట్ల మంది ఉద్యోగుల వర్తమానం మరియు భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రధాని ‘ద్రవ్యోల్బణం పెంచండి, ఆదాయాలను తగ్గించండి’ నమూనాను అమలు చేశారు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా ప్రధానమంత్రి మోదీ పై విమర్శలు చేశారు. ‘సెంట్రల్ విస్టా అవెన్యూకి సంబంధించిన స్పష్టమైన సూచనలో వేల కోట్లతో ‘మోదీ మహల్’ నిర్మిస్తున్నారు’ అంటూ పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ‘లోక్ కళ్యాణ్ మార్గ్’ పేరునే జీర్ణించుకోలేని ప్రధాని మోదీ.. వేల కోట్లు ఖర్చు చేస్తూ తన పేరుపై ‘మోదీ మహల్’ నిర్మించుకుంటున్నారంటూ పవన్ ఖేరా విమర్శించారు.

Other Stories: Anand Mahindra : వావ్..చిటారుకొమ్మన ఉన్న కాయల్ని కూడా ఇంత ఈజీగా తెంపొచ్చా..ఆనంద్ మహేంద్ర ఫిదా