Train Monthly Pass : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది.

Train Monthly Pass : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు!

Train Monthly Pass

Train Monthly Pass : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో నెలవారీ పాసులు జారీ చేయనుంది రైల్వే శాఖ. రైల్వే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నెలవారీ పాసులను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉంది. ఇప్పటికే కరోనా కారణంగా రైల్వేలో అనేక సేవలు నిలిచిపోయాయి. దీంతో గత కొన్ని నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పటికప్పుడు టిక్కెట్ తీసుకునే అవకాశం లేకపోవటం, ముందుగా రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించాల్సి ఉండటం సమస్యగా మారింది. దీనికి తోడు నిత్యం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రాకపోకలు సాగించే ఉద్యోగులకు, విద్యార్ధులకు నెలవారీ పాస్ సౌకర్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో రైల్వేశాఖా ప్రయాణికుల సౌకర్యాలను తిరిగి పునరుద్ధరించే ఆలోచన చేస్తోంది.

కరోనా పరిస్ధితులు సాధారణ స్ధితికి వస్తున్న తరుణంలో ప్రజల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే తమ దైనందిన జీవితాలను గడుపుతున్నారు. ఈ సమయంలో దూరప్రాంత ప్రయాణాలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాయితీతో రైలులో ప్రయాణించే వారికి కరోనా కారణంగా అసౌకర్యం నిలిచిపోవటం ఒకింత ఇబ్బంది కరంగా మారింది. అదనపు ఛార్జీలు చెల్లించి, ముందస్తుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉండేది.

ఇటీవల భోపాల్ రైల్వే డివిజన్ నెలవారీ పాస్ లను తిరిగి పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదన పంపింది. అయితే దీనిపై కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులందరికి వర్తించేలా ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. నెలవారీ పాస్ ల జారీ ద్వారా రైల్వేకు నికర అదాయం లభిస్తుంది. గత ఏడాదిగా సీజనల్ పాస్ ల జారీ నిలిచిపోవటంతో వచ్చే ఆదాయానికి గండిపడింది. త్వరలో తీసుకోబోయే రైల్వే శాఖ నిర్ణయం కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.